Begin typing your search above and press return to search.

టైమ్ డిసైడ్ చేస్తే త‌ల్లికి మ‌ళ్లీ పెళ్లి చేస్తుంద‌ట‌

By:  Tupaki Desk   |   27 Feb 2022 4:30 AM GMT
టైమ్ డిసైడ్ చేస్తే త‌ల్లికి మ‌ళ్లీ పెళ్లి చేస్తుంద‌ట‌
X
సింగ‌ర్ సునీత ఇటీవ‌ల రెండో పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆమె త‌రువాత చాలా మంది నీటీమ‌ణుల పేర్లు వార్త‌లో నిలిచారు. చాలా వ‌ర‌కు నెట్టంట వైర‌ల్ అయ్యాయి. అందులో న‌టి సురేఖా వాణి పెళ్లి వార్త కూడా హాట్ టాపిక్ గా మారింది.

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా, వ‌దిన‌గా, త‌ల్లిగా న‌టిస్తూ తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది సురేఖా వాణి. ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్న ఆమె త‌న కూతురు సుప్రీత‌తో క‌లిసి నెట్టింట వైర‌ల్ వీడియోల‌తో సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఓ ప‌క్క సినిమాల్లో న‌టిస్తూనే కూతురితో క‌లిసి సోష‌ల్ మీడియాలో సురేఖా వాణి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. వ‌రు పోస్ట్ ల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తున్న ఆమెపై ఇటీవ‌ల ఓ వార్త వైర‌ల్ గా మారింది. మూడేళ్ల క్రితం సురేఖా వాణి భ‌ర్త చ‌నిపోయాడు. అప్ప‌టి నుంచి కూతురు సుప్రీత‌తో క‌లిసి వుంటోంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో ద‌ర్శ‌న‌మిస్తూ కూతురు సుప్రీత‌తో పోటీప‌డుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకోవ‌డంతో అవి వైర‌ల్ గా మారుతున్నాయి.

ఇదిలా వుంటే ఆమె త్వ‌ర‌లో మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతోందంటూ ఓ వార్త నెట్టింట‌ వైర‌ల్ గా మారింది. అయితే ఈ పెళ్లి వార్త‌ల్లో ఎలాంటి నిజంలేద‌ని, అవ‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత కొట్టి పారేశారు. సురేఖా వాణి పెళ్లి గురించి సుప్రీత తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

పెళ్లి విష‌యంలో పూర్తి నిర్ణ‌యం అమ్మ‌దే. నాకైతే అమ్మ‌కి పెళ్లిచేయాల‌ని వుంది. ఖ‌చ్చితంగా అమ్మ ఒప్పుకుంటే పెళ్లి చేస్తా. అయితే అది నా చేతుల్లో లేదు. టైమ్ డిసైడ్ చేస్తుంది. నాన్న చ‌నిపోయి మూడేళ్ల‌వుతోంది. ఇప్పుడిప్పుడే అమ్మ కుదురుకుంటోంది. అమ్మ త‌న కెరీర్ కంటే ఎక్కువ‌గా నా కెరీర్ గురించే ఆలోచిస్తోంది` అంటూ చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా త‌ను ఏది చెబితే అది చేస్తాన‌ని, అయితే త‌న ఇస్టాన్ని కూడా అమ్మ గౌర‌విస్తుంద‌ని తెలిపింది. కెరీర్ ప‌రంగా నాన్న ఇబ్బందిప‌డుతున్న స‌మ‌యంలో అమ్మే మ‌మ్మ‌ల్ని చూసుకుంద‌ని, చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ ఫ్యామిలీని చూసుకుంద‌ని తెలిపింది. అయితే నాన్న చ‌నిపోయిన సంద‌ర్భంలో మాత్రం అమ్మ‌పై చాలా మంది దారుణంగా కామెంట్ లు చేశార‌ని, అవి విని అమ్మ ఎంత‌గా బాద‌ప‌డిందో నాకు తెలుస‌ని భావోద్వేగానికి లోనైంది.

అందుకే కామెంట్ల‌ని నేను పెద్ద‌గా ప‌ట్టించుకోను చూడ‌ను.. అమ్మ‌ని కూడా చూడొద్ద‌ని చెబుతాను. నాన్న చ‌నిపోయిన బాధ‌ని మ‌ర్చిపోవాల‌ని పార్టీల‌కి వెళ్లినా కామెంట్ లు చేశారు. అమ్మ మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతోందంటూ దారుణంగా ట్రోల్ చేశారు. ఇలాంటి కామెంట్ వ‌ల్ల మేము ఎంత బాధ‌ప‌డ్డామో మాకు తెలుసు` అని సుప్రీత చెప్పుకొచ్చింది. సుప్రీత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన తాజా వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.