Begin typing your search above and press return to search.
తల్లి కావడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటున్న సీనియర్ హీరోయిన్..!
By: Tupaki Desk | 5 Sep 2022 1:30 PM GMTసీనియర్ నటి టబు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తెలుగు తమిళ హిందీ మలయాళ చిత్రాలతో అలరించింది. తన అంద చందాలతో ఇప్పటికీ కుర్ర భామలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది.
50 ఏళ్ళు దాటినా ఇప్పటి వరకూ పెళ్లి మాట ఎత్తని నటీమణులలో టబు ఒకరు. స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న టైంలో ఒకరిద్దరు హీరోలతో లింక్ చేస్తూ రూమర్స్ వచ్చాయి కానీ.. ఏదీ కూడా పెళ్లి వరకు రాలేదు. ఈ విషయం గురించి ఎవరైనా అడిగితే వివాహంతో అవసరం ఏముందని సమాధానం చెబుతూ వస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావన రాగా టబు సంచలన వ్యాఖ్యలు చేసింది. ''మీరు ఇంత వరకూ పెళ్లి చేసుకోలేదు. మీకు అమ్మ అని పిలిపించుకోవాలి అనే ఆశ లేదా?" అని అడగ్గా.. తల్లి కావడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా స్పందించింది. పెళ్ళికి, పిల్లలకి వయసుతో సంబంధం లేదని టబు పేర్కొంది.
''తల్లి అవ్వాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి కాకుండానే గర్భం దాల్చొచ్చు. సరోగసి ద్వారా కూడా తల్లి అయ్యే అవకాశం ఉంది. అలా చేస్తే నన్ను ఆపేవారు ఎవరు. నన్ను ఎవరూ ఆపరు. అయినా పెళ్లి కాకపోయినా.. పిల్లల్ని కనకపోయినా చచ్చిపోతామా ఏంటి?'' అని టబు ప్రశ్నించింది.
ప్రస్తుతం తన సినిమా కెరీర్ ని, యాక్టింగ్ ని ఎంజాయ్ చేస్తున్నానని టబు తెలిపింది. పెళ్ళికి, పిల్లలకి వయసుతో సంబంధం లేదని.. అసలు ఈ రోజుల్లో దేనికి వయసుతో సంబంధం లేదని ఆమె పేర్కొంది. టబు వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. టబు నిజంగానే పెళ్లి చేసుకోకుండా సరోగసి ద్వారా తల్లి అవుతుందేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, 'కూలీ నెం.1' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన టబు.. 'నిన్నేపెళ్లాడుతా' చిత్రంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత 'ఆవిడా మా ఆవిడే' 'పాండురంగడు' 'చెన్నకేశవ రెడ్డి' 'అందరివాడు' 'ఇదీ సంగతి' వంటి చిత్రాల్లో నటించింది.
టబు తెలుగులో హీరోయిన్ గా చేసింది కొన్ని సినిమాలే అయినా.. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇక హిందీలో కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఎలాంటి పాత్ర అయినా చేయగలదని నిరూపించుకుంది. ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తున్న టబు.. 'అల వైకుంఠపురములో' సినిమాతో మరోసారి తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.
ఇటీవల 'భూల్ బులయ్యా 2' సినిమాలో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంది టబు. ప్రస్తుతం 'కుట్టి' 'ఖుఫియా' 'భోళా' వంటి చిత్రాల్లో నటిస్తున్న సీనియర్ బ్యూటీ.. 'దృశ్యం 2' సినిమా షూటింగ్ పూర్తి చేసింది. త్వరలోనే ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.