Begin typing your search above and press return to search.
టబుకు పెళ్లి కాకపోవడానికి అతను కారణమా?
By: Tupaki Desk | 10 July 2018 4:34 AM GMT50వ పడికి దగ్గరగా ఉంది టబు. దాదాపు పాతికేళ్లుగా ఆమె సినిమాల్లో కొనసాగుతోంది. ఆమె తోటి హీరోయిన్లలో చాలామంది పెళ్లిళ్లు చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు. యుక్త వయసుకు వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు వాళ్లకు. కానీ టబు మాత్రం పెళ్లీ గిల్లీ ఏమీ చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయింది. ఓ తెలుగు సీనియర్ హీరోతో బంధం వల్లే ఆమె పెళ్లికి దూరంగా ఉండిపోయిందన్న ఒక ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. కానీ టబు మాత్రం తనకు పెళ్లికాకపోవడానికి కారణం అంటూ ఓ బాలీవుడ్ హీరోను చూపించింది. అలాగని ఆ హీరో గురించి మరో రకంగా మాట్లాడలేదు. చాలా పాజిటివ్ గానే స్పందించింది. ఆ హీరో మరెవరో కాదు.. అజయ్ దేవగన్.
తనకు అజయ్ తో పాతికేళ్లుగా స్నేహం ఉందని టబు చెప్పింది. తన జీవితం ఆరంభం నుంచి అజయ్ తనతో ఉన్నాడని టబు చెప్పింది. ఎందుకు ఏమిటి అని చెప్పలేదు కానీ.. అజయ్ వల్లే తాను పెళ్లి చేసుకోలేదని మాత్రం టబు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోనందుకు తనకు ఎలాంటి బాధా లేదని కూడా ఆమె పేర్కొంది. టబు.. అజయ్ తో కలిసి చాలా సినిమాల్లో నటించింది. వీళ్లిద్దరూ కలిసి చివరగా ‘దృశ్యం’లో నటించారు. మరి స్నేహితుడైన అజయ్.. టబు పెళ్లికి ఎలా అడ్డంకి అయ్యాడో.. ఇందులో లాజిక్ ఏంటో ఆమెకే తెలియాలి. పెళ్లి చేసుకుంటే బాగుంటుందా.. చేసుకోకుంటే బాగుంటుందా అన్నది తాను చెప్పలేనని.. పెళ్లి చేసుకుంటేనే అది బాగుందో లేదో తెలిసేదని.. తనకు ఆ అనుభవం లేదు కాబట్టి ఏది బెటరో చెప్పలేనంటూ వేదాంతం వల్లించింది టబు. ప్రస్తుతానికైతే తన జీవితం సంతోషంగా సాగిపోతున్నట్లుగా ఆమె చెప్పింది.