Begin typing your search above and press return to search.
రేప్ చేసి చంపేస్తామంటున్నారు: సాగరిక సంచలన ఆరోపణ!
By: Tupaki Desk | 23 July 2021 1:30 PM GMTప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై సీరియస్ ఆరోపణలు చేసిన మోడల్, నటి సాగరిక ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. తనను అత్యాచారం చేసి చంపేస్తామంటున్నారని బెదిరింపులు వస్తున్నాయని ఆమె వాపోయింది. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ వాపోయింది.
సాగరిక మీడియాతో మాట్లాడుతూ ‘తనను కొందరు వ్యక్తులు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. అత్యాచారం చేసి చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అసలు రాజ్ కుంద్రా ఏం చేశాడని ప్రశ్నిస్తున్నారు. మీరు అశ్లీల చిత్రాలు చూస్తారు కాబట్టి మేము వాటిని చిత్రీకరిస్తున్నామని దబాయించారు. ఈ చీకటి వ్యాపారానికి ముగింపు పడటానికి కారణం నేనేనని నిందిస్తున్నారు.. వేర్వేరు నంబర్ల నుంచి ఈ ఫోన్లు వస్తూనే ఉన్నాయి’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.
రాజ్ కుంద్రాపై వ్యాఖ్యల తర్వాత నా జీవితం ప్రమాదంలో పడినట్లు అనిపిస్తోందన్నారు. దీనికి కారణమైన వారిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని సాగరిక తెలిపింది. కాగా రాజ్ కుంద్రా దగ్గర పనిచేసే ఉమేశ్ కావత్ నుంచి తనకు వెబ్ సిరీస్ కోసం పిలుపు వచ్చిందంటూ సాగరిక ఇంటర్వ్యూ ఒకటి వైరల్ గా మారింది. అయితే వీడియో కాల్ ద్వారా ఆడిషన్ ఉంటుందని.. ఈ వీడియో కాల్ లో నగ్నం కనిపించాలని చెప్పడంతో దాన్ని తిరస్కరించానని చెప్పింది.
రాజ్ కుంద్రా సారథ్యంలోనే హాట్ షాట్ యాప్ ద్వారా ఈ రాకెట్ నిర్వహిస్తున్నట్లు నటి సాగరిక ఇటీవల ఆరోపించారు. తాను అశ్లీల వ్యాపారానికి బాధితురాలిని అని.. అందులో ప్రవేశించినప్పుడు తాను బాధలో ఉన్నానని హైకోర్టులో సాగరిక పిల్ దాఖలు చేసింది. మానసికంగా హింసించారని.. ఆన్ లైన్ లో చాలా మంది వ్యక్తులు వేధించారని ఆమె ఆరోపించింది.
ఇక జార్ఖండ్ బాలిక ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను అశ్లీల వీడియోలో నటించకుంటే 10 లక్షల పరిహారం చెల్లించాలని.. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రాసుకొచ్చారని పేర్కొంది. ఇలా రాజ్ కుంద్రా కేసులో కీలకమైన ఫిర్యాదుల తర్వాతే పోలీసులు చర్యలు చేపట్టారు.