Begin typing your search above and press return to search.
నా పెళ్లెందుకు తప్పిపోయిందో తెలుసా?
By: Tupaki Desk | 2 Nov 2016 7:30 PM GMTహీరోయిన్స్ కెరీర్ అంటే సాధారణంగా పీక్ స్టేజ్ లో ఉన్నంతవరకో.. లేక మరీ ఇండస్ట్రీని పట్టుకు వేళ్లాడితే పెళ్లి చేసుకునేంతవరకో ఉంటుందంతే. బాలీవుడ్ లో అయినా కొంచెం నయం కానీ.. సౌత్ లో అయితే ఓ భామ పెళ్లి చేసుకునేందుకు ఆలోచిస్తోందని తెలిసినా సరే.. ఆఫర్లు అడుగంటిపోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో.. చెన్నై బ్యూటీ త్రిష మాత్రం చాలా పెద్ద కోరికే కోరింది.
గత కొన్నేళ్లుగా సరైన హిట్టు కాదు.. అసలు సక్సెస్ కూడా రుచి చూడని త్రిష.. ఇప్పుడు కోలీవుడ్ మూవీ కోడి సక్సెన్ ను బాగానే ఎంజాయ్ చేస్తోంది. 'నా జీవిత లక్ష్యం ఏంటి అని ఎవరైనా అడిగితే సినిమా అని చెబుతానంతే. నేను సినిమాతోనే చనిపోవాలని కోరుకుంటా. గత రెండేళ్లలో నా జీవితానికి సినిమానే కీలకమైన బలం అని తెలుసుకున్నా' అంటోంది త్రిష. మరి పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తావ్ బ్యూటీ అనే ప్రశ్న ఎదురైంది.
'అందుకే కదా నా పెళ్లి తప్పిపోయింది' అంటూ జోక్ చేసింది త్రిష. గతంలో ఈమెకు ప్రొడ్యూసర్ వరుణ్ మణియన్ తో ఎంగేజ్మంట్ అయ్యాక పెళ్లి క్యాన్సిల్ అయిన విషయాన్ని ఇలా గుర్తు చేసిందన్న మాట. అయితే 'నా పెళ్లి జరిగినా సరే.. కేవలం బిడ్డను కన్నపుడు మాత్రమే బ్రేక్ తీసుకుంటా. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి కచ్చితంగా వచ్చేస్తా' అంటోందీ చెన్నై సోయగం.