Begin typing your search above and press return to search.
కోటికి తగ్గనని ఆఫర్ వదులుకున్న త్రిష?
By: Tupaki Desk | 16 Oct 2022 7:30 AM GMTజయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటోంది అందాల త్రిష. మణిరత్నం పీఎస్ -1 లో అందాల రాకుమారి పాత్రలో అదరగొట్టింది. త్రిష నటన ఆహార్యానికి మంచి పేరొచ్చింది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ నందిని అనే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించినా త్రిష హుందా అయిన ఆహార్యం అద్భుతమైన లుక్స్ తో పోటీపడుతూ నటించింది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ సోదరిగా త్రిష నటించింది.
పీఎస్ 1 విజయం తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ విజయంతో మణిరత్నం దాహం తీరింది. దీంతో పార్ట్ 2 ని అంతకంటే గ్రాండియర్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం ఉంది. త్రిష పాత్ర ఇందులో ఏ తీరుగా ఉంటుందో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఇంతలోనే ఈ భామకు తెలుగులో ప్రముఖ హీరో నుంచి అవకాశం వచ్చిందని తెలిసింది.
బాలకృష్ణ కథానాయకుడిగా అనీల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలో త్రిషను కథానాయికగా ఎంపిక చేసారు. కానీ కోటి పారితోషికం డిమాండ్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి దమ్ము-లయన్ లాంటి ఫ్లాప్ సినిమాల్లో నటించిన త్రిషకు తెలుగులో ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్ అయ్యాయి. చాలా ఏళ్లుగా పూర్తిగా తమిళ పరిశ్రమకే అంకితమైంది. కానీ ఇప్పుడు కంబ్యాక్ మూవీ కోసం భారీ పారితోషికం డిమాండ్ చేస్తుండడంతో నిర్మాతలు వెనకాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆచార్య నుంచి స్కిప్..
అదృష్టమో దురదృష్టమో.. మెగాస్టార్ `ఆచార్య`లో అవకాశం వచ్చినా కానీ త్రిష కాదనుకుని మిడిల్ డ్రాపైంది. ఆ తర్వాత ఈ చిత్రంలో కాజల్ నటించిన సంగతి తెలిసిందే. కానీ కథానాయిక పాత్రకు ఏమంత ప్రాధాన్యత లేదు. అలాగే ఆచార్య అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. తెలిసో తెలియకో త్రిష అలా ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్ నుంచి బయటపడింది. కానీ ఇప్పుడు తన కంబ్యాక్ అదిరిపోవాలంటే బాలయ్య లాంటి పెద్ద స్టార్ సరసన ఆఫర్ కావాలి. కానీ కోటి పైగా పారితోషికం డిమాండ్ చేస్తూ భయపెట్టేస్తోందిట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య- శ్రీలీల తండ్రీకూతుళ్లుగా నటిస్తున్న తాజా చిత్రం కోసం కథానాయికగా త్రిషను సంప్రదించగా పారితోషికంలో బెట్టు చేసిందని వార్తలు వస్తున్నాయి. అయితే త్రిషను సంప్రదించిన మాట వాస్తవమేనా? అని ప్రశ్నిస్తే మేకర్స్ వైపు నుంచి సరైన ఆన్సర్ లేదు. ఇవన్నీ పుకార్లు మాత్రమేనన్న ఖండన కూడా బలంగా వినిపిస్తోంది.