Begin typing your search above and press return to search.
పర్సనల్ లైఫ్ గురించి సీక్రెట్ చెప్పేసిన త్రిష
By: Tupaki Desk | 27 May 2019 7:33 AM GMTసౌత్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరు. తెలుగులో త్రిషకు అవకాశాలు లేవు కానీ తమిళంలో మాత్రం క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది. పోయినేడాది '96' తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం త్రిష చేతిలో దాదాపు అర డజను ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒకటి 'రాంగి'. ఎం. శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎఆర్ మురుగదాస్ కథ అందించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా త్రిష సోషల్ మీడియాలో తన అభిమానులతో పిచ్చాపాటీ మాట్లాడింది. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఒక హింట్ ఇచ్చింది.
ఒక అభిమాని త్రిష ను రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అడిగాడు. దానికి సమాధానంగా "సింగిల్ బట్ టేకెన్' అని సమాధానం ఇచ్చింది. సింగిల్ అంటే మారిటల్ స్టేటస్ సింగిల్ అని. అది అర్థం అయింది. మరి 'టేకెన్' అంటే ఏంటి? ఒక వ్యక్తితో తోనే అనుబంధం కొనసాగిస్తూ.. మరో ఆప్షన్ లేదా మరో పార్ట్నర్ గురించి ఆలోచించకపోవడాన్ని టేకెన్ అంటారు. అందంగా కాకుండా మాసుభాషలో చెప్పుకుంటే రిజర్వేషన్ అయిపోయిందన్నమాట. ఈ విషయం వెల్లడించడంతోనే త్రిష ఎవరితోనో లవ్వులో ఉందన్న విషయం దాదాపుగా అందరికీ కన్ఫాం అయింది.
అంతటితో త్రిష తన సమాధానాన్ని ఆపలేదు. వివాహం పై తన అభిప్రాయం తెలుపుతూ "చేసుకోవాలనిపిస్తే చేసుకోండి అదేమీ అవసరం కాదు" అని చెప్పింది. సో..ఇప్పటికిప్పుడు పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన లేదన్నమాట. త్రిషకు 2015 లో వరుణ్ మణియన్ అని వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత తమ వివాహం క్యాన్సిల్ చేసుకొని ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి త్రిష మళ్ళీ సింగిల్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది. మరి ఇప్పుడు త్రిష జీవితంలో ఉన్న వ్యక్తి ఎవరో?