Begin typing your search above and press return to search.

నడుము నాభి అందం చూపిస్తూ హొయలు పోతున్న నాని హీరోయిన్‌

By:  Tupaki Desk   |   8 Jan 2023 2:30 PM GMT
నడుము నాభి అందం చూపిస్తూ హొయలు పోతున్న నాని హీరోయిన్‌
X
నానితో కలిసి ఆహా కళ్యాణం సినిమాలో నటించిన ముద్దుగుమ్మ వాణి కపూర్‌. ఆ తర్వాత తెలుగు లో ఈ అమ్మడు కనిపించలేదు. ప్రస్తుతం వరుసగా హిందీలో సినిమాలు చేస్తున్న వాణి కపూర్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే అందాల ఆరబోత ఫొటోలు రెగ్యులర్ గా వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందాల ఆరబోత ఫొటోలతో నెటిజన్స్ ను అలరించింది.

నడుము నాభి అందాలను చూపిస్తూ కొంటెగా చూస్తూ... హొయలు పోతున్న ఈ అమ్మడి ఫొటోలకు నెటిజన్స్ నుండి తెగ లైక్స్ వస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ యొక్క స్కిన్‌ టోన్‌ మరియు బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి వావ్‌ అనిపిస్తుంది. వాణి కపూర్‌ రెగ్యులర్‌ గా స్కిన్‌ షో చేస్తుంది కానీ ఈ అమ్మడి తాజా ఫొటోలు చూపు తిప్పుకోనివ్వడం లేదు.

ఈ స్థాయిలో అందాలను చూపిస్తున్న కారణంగానే ఈమెకు వరుసగా హిందీలో ఆఫర్లు వస్తున్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. సౌత్‌ లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. కానీ ఇక్కడ ఎక్కువ ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం హిందీలోనే వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు సౌత్ లో చేస్తుందేమో చూడాలి.

షంషేరా సినిమాతో ఈ అమ్మడు బాలీవుడ్‌ లో గత ఏడాది సందడి చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆ సినిమా నిరాశ పర్చడం తో ఈ అమ్మడి యొక్క తదుపరి సినిమా ఏంటా అంటూ ఫ్యాన్స్‌ ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతానికి ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని.. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. సక్సెస్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వాణి కపూర్‌ వరుసగా సినిమాలు చేస్తూ ఉంది.