Begin typing your search above and press return to search.

చనిపోయిన ఆ వ్యక్తి నా భర్త కాదు

By:  Tupaki Desk   |   3 May 2023 11:51 PM IST
చనిపోయిన ఆ వ్యక్తి నా భర్త కాదు
X
నటి వనిత విజయ్ కుమార్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు పలు సినిమాలతో సుపరిచితురాలిగా మారిన వనిత విజయ్ కుమార్‌ ఆ మధ్య తన ఆస్తి గొడవ కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. కుటుంబ సభ్యులతోనే గొడవ పడి వార్తల్లో నిలిచిన ఈమె ఆ తర్వాత పలు వివాదాల కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే.

బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రచ్చ రచ్చ చేసిన వనిత విజయ్ కుమార్‌ ఆ సమయంలో ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇద్దరు భర్తల నుండి విడిపోయిన వనిత విజయ్ కుమార్‌ మూడవ సారి పీటర్ పాల్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని కొన్నాళ్లు.. పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్నాళ్లు వార్తలు వచ్చాయి.

పీటర్ పాల్‌ తో ఉన్న ఫోటోలను వనిత విజయ్ కుమార్‌ పలు సందర్భాల్లో షేర్ చేసింది. ఇద్దరు సహ జీవనం సాగించారు. పెళ్లి గురించిన కూడా ప్రచారం జరిగింది. పీటర్ పాల్‌ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉండగా వనిత సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ ను షేర్‌ చేసిన విషయం తెల్సిందే.

కొన్నాళ్లకు పీటర్ పాల్‌ మృతి చెందాడు. ఆయన మృతి పట్ల కూడా వనిత ఎమోషనల్ గా సోషల్ మీడియా ద్వారా పోస్ట్‌ షేర్ చేసిన విషయం తెల్సిందే. దాంతో చనిపోయిన వ్యక్తి వనిత భర్త అనే ప్రచారం జోరుగా సాగింది. ఆ విషయమై వనిత స్పందించింది.

తాను అతడిని అధికారికంగా చట్టబద్దంగా పెళ్లి చేసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అతడు మంచి స్నేహితుడు మాత్రమే అన్నట్లుగా పేర్కొంది. ఉన్నట్టుండి ఈ ట్విస్ట్ ఏంటి అమ్మడు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వనిత విజయ్ కుమార్‌ తీరును విమర్శిస్తున్నారు.

మూడవ భర్త అంటూ వస్తున్న వార్తలను ఆమె తప్పుబట్టింది. పెళ్లి చేసుకుని చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు అనడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ఆమెను పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు వనిత సమాధానం ఏంటి అనేది చూడాలి.