Begin typing your search above and press return to search.

పెద్ద‌ల పెళ్లి అది బ‌ల‌వంత‌పు పెళ్లి!

By:  Tupaki Desk   |   30 Jun 2023 11:00 PM GMT
పెద్ద‌ల పెళ్లి అది బ‌ల‌వంత‌పు పెళ్లి!
X
ప్రేమ పెళ్లి..పెద్ద‌ల కుదిర్చిన పెళ్లిళ్ల‌పై ఎవ‌రి అభిప్రాయాలు వారికుంటాయి. త‌రుచూ హీరోయిన్లు ఎక్కువ‌గా ఈ రెండు ర‌కాల పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంటారు. దాదాపు అంతా ప్రేమ పెళ్లికే ఓటేస్తారు. ఇంకొంత మంది ప్రేమ‌లో ప‌డిన త‌ర్వాత లివ‌న్ రిలేష‌న్ షిప్ కొన‌సాగించ‌డం ఇంకా ఉత్త‌మం అంటారు. ఒక‌ర్ని ఒక‌రు మ‌రింత లోతుగా అర్ధం చేసుకోవ‌డానికి ఆ రిలేష‌న్ షిప్ దొహ‌దం చేస్తుందంటారు. న‌చ్చితే ముందుకెళ్లొచ్చు. లేదంటే అక్క‌డితోనే ఆ బంధానికి పుల్ స్టాప్ పెట్టేయోచ్చు అన్న‌ది చాలా మంది మాట‌.

తాజాగా పెళ్లి గురించి హాట్ బ్యూటీ వ‌ర‌ల‌క్ష్మి కూడా త‌న అభిప్రాయాన్ని చెప్పింది. చేసుకుంటే ప్రేమ పెళ్లి చేసుకోవాల‌ని...లేక‌పోతే పెళ్లి చేసుకోక‌పోవ‌డం మంచిద‌ని..జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు చేర‌డం కోసం క‌ష్ట‌ప‌డంటం మంచిద‌ని తెలిపింది. పెద్ద‌ల కుద‌ర్చిన పెళ్లిలో ప్రేమ ఉండ‌ద‌ని..అలాంటి బంధంలో ఇరుక్కుపోవ‌డం అన్న‌ది బ‌ల‌వంత‌పు పెళ్లి..కాపురం అవుతుంద‌ని చెప్పుకొచ్చింది. త‌న వ‌ర‌కూ ప్రేమ పెళ్లికే ఓటేస్తాన‌ని కుండ బ‌ద్దలు కొట్టేసింది. మ‌రి మీ పెళ్లి ఎప్పుడు అంటే? ఇంకా ప్రేమ‌లో ప‌డ‌లేద నేసింది.

జీవితంలో త‌న‌కి కొన్ని ల‌క్ష్యాలు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చింది. సినిమాల త‌ర్వాత రాజ‌కీయాల్లో కూడా రాణించాల నుకుంటున్న‌ట్లు తెలిపింది. శ‌ర‌త్ కుమార్ కుమార్తె వ‌ర‌ల‌క్ష్మి కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అన‌తి కాలంలో న‌టిగా స‌త్తా చాటింది. హీరోయిన్ అవ్వాల‌ని వ‌చ్చింది. కానీ ప‌రిశ్ర‌మ ఆమెని విలనీని చేసింది.

ప్ర‌స్తుతం ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో `స‌బ‌రి` అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఇది కేవ‌లం తెలుగులోనే తెరకెక్కిస్తున్నారు. త‌మిళ్ లో అనువాద రూపంలో రిలీజ్ చేయ‌నున్నారు. అలాగే కోలీవుడ్..మాలీవుడ్ లో మాత్రం చాలా సినిమాలు చేస్తుంది. 2023 ఆమె క్యాలెండ‌ర్ మొత్తం పుల్ అయింది. దాదాపు 13 సినిమాలు చేస్తుంది. సీనియ‌ర్ హీరోలు చిరంజీవి..బాల‌కృష్ణ చిత్రాల్లొ ప్ర‌తి నాయిక పాత్ర‌కు స‌రిగ్గా తూగుతుంద‌ని చెప్పొచ్చు.