Begin typing your search above and press return to search.

రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత మ‌ళ్లీ త‌మ్ముడు సోద‌రి

By:  Tupaki Desk   |   11 May 2023 5:00 AM GMT
రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత మ‌ళ్లీ త‌మ్ముడు సోద‌రి
X
'తొలిప్రేమ' లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రి పాత్ర‌లో న‌టించిన త‌మిళ న‌టి వాసుకి సుప‌రిచితురాలే. ఆ సినిమాతో వాసుకి న‌టిగా మంచి పేరొచ్చింది. బుల్లి తెర సీరియ‌ల్ న‌టిగానూ వాసుకి ఫేమ‌స్ అయ్యారు. ప‌వ‌న్ స్నేహితుడు ఆనంద్ సాయిని వివాహం చేసుకోవ‌డంతో ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రయ్యారు. అయితే న‌టిగా మాత్రం కొన‌సాగ‌లేదు. 'తొలిప్రేమ' త‌ర్వాత అవకాశాలు వ‌చ్చినా మ్యాక‌ప్ వేసుకోలేదు.

దాదాపు రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత మ‌ళ్లీ 'అన్నీ మంచుశ‌క‌నుములే' సినిమాతో కంబ్యాక్ అవుతున్నారు. త్వ‌ర‌లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఈ సంద‌ర్భంగా వాసుకి సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల్ని రివీల్ చేసారు.

'తొలి ప్రేమ త‌ర్వాత అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ చేయ‌డం కుద‌ర్లేదు. నేను మ‌ల్టీ టాస్క్ టాస్క‌ర్ ని కాదు. అన్ని ప‌నులు ఒకేసారి చేయ‌లేను. కుటుంబం పిల్ల‌ల‌తో ఇన్నాళ్లు తీరిక స‌మ‌యం దొర‌క‌లేదు. పిల్ల‌లు ఇప్పుడు విదేశాల్లో చ‌దువుతున్నారు. మావారు ఆయ‌న బిజీలో ఆయ‌న ఉంటుంన్నారు. నాకు ఏదైనా చేయాల‌నిపించింది. అందుకే మ‌ళ్లీ యాక్టింగ్ వైపు వ‌స్తున్నా. ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు సైకాల‌జీలో పీహెచ్ డీ కూడా చేస్తున్నా.

ఇందులోనూ త‌మ్ముడికి అండ‌గా ఉండే సోద‌రి పాత్ర లో పోషిస్తున్నా. క‌థ బాగా న‌చ్చ‌డంతో చేస్తున్నా సినిమా ఇది. ఇంత కాలం సినిమాలు చేయ‌లేద‌ని ఏనాడు ఫీల‌వ్వ‌లేదు. మా ఆయ‌న ఆనంద్ వ‌ల్ల ఇంట్లో రోజు సినిమా చ‌ర్చ ఉంటుంది. న‌ట‌నే కాదు ..దేన్నీ సిరియ‌స్ గా తీసుకోను. ఇదే చేయాలి. ఈ దారిలోనే ముందుకెళ్లాలి? అన్న‌ది ఏమీ లేదు. కొంచెం ఫిలాసిఫ‌ల్ గా ఉంటాను.

ఏ పాత్ర చేసినా అందులో నా మార్క్ ప‌డేలా ఉండాలి. అలాంటి పాత్ర‌ల‌కే క‌మిట్ అవుతాను. త‌మిళ్ లో అలాంటి సినిమాలే చేస్తున్నాను. ఈ మ‌ధ్య కాలంలో హింసాత్మ‌క సినిమాలు ఎక్కువైపోయాయి. వాటికి భిన్నంగా అన్నీ మంచి శ‌క‌నుములే ఉంటుంది. అంతా బాగానే ఉంది. హ్యీపీగానే ఉంద‌నే సినిమాలు త‌గ్గిపోయాయి. నాకు ఈ క‌థ విన‌గానే అలాంటి మంచి సినిమా అనింపిందింది. అందుకే వెంట‌నే ఒప్పుకున్నా' అని అన్నారు.