Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుడు గ‌ర్భిణిని చేసి వదిలేశాడ‌న్న న‌టి

By:  Tupaki Desk   |   11 April 2022 3:53 AM GMT
ద‌ర్శ‌కుడు గ‌ర్భిణిని చేసి వదిలేశాడ‌న్న న‌టి
X
క్వీన్ కంగ‌న హోస్టింగ్ చేస్తున్న‌ లాక్ అప్ విన్యాసాల గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే లాక్ అప్ యూత్ లో విశేష ఆద‌ర‌ణ అందుకుంటోంది. ఈ వేదిక‌పై తార‌లు త‌మ జీవితాల్లో విచ్ఛ‌ల‌విడిత‌నాన్ని కూడా ఎలాంటి భేష‌జం లేకుండా బ‌య‌టికే చెప్పేస్తూ షాక్ లిస్తున్నారు.

తాజాగా ప్ర‌ముఖ మోడ‌ల్ కం న‌టి త‌న‌ని ఓ ద‌ర్శ‌కుడు గ‌ర్భిణిని చేసి వ‌దిలేశాడ‌ని ఆరోపించింది.'మహిళా హక్కుల' గురించి మాట్లాడే దర్శకుడితో త‌న‌కు ఎఫైర్ ఉందని మందన కరిమి స్వ‌యంగా షోలో వెల్లడించింది. మేము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసాము. కానీ గ‌ర్భిణి అయ్యాక అత‌డు మోసం చేశాడు అని తెలిపింది.

లాక్ అప్ అనేది కంగనా హోస్టింగ్ చేస్తున్న క్యాప్టివిటీ ఆధారిత రియాలిటీ షో. జైలర్ గా కరణ్ కుంద్రా క‌నిపిస్తున్నారు. ఇది నాటకీయతతో నిండి ఉన్న రియాలిటీ గేమ్‌. ఇటీవలి ఎపిసోడ్ లో హాస్యనటుడు మునావర్ ఫరూఖీ తనకు వివాహమైందని .. ఒక బిడ్డ కూడా ఉన్నాడని వెల్లడించ‌గా.. తాజా ఎపిసోడ్ లో మందన కరిమి త‌న జీవితంలో జ‌రిగిన ఓ విష‌యాన్ని వెల్ల‌డించి షాకిచ్చింది. త‌న నిజాయితీ షోలో అందర్నీ ఉద్వేగానికి గురి చేయ‌డ‌మే గాక‌... కంట తడి పెట్టించింది.

ఈ రియాలిటీ షోలో మనుగడ సాగించడానికి ఛార్జిషీట్ లో చేరిన పోటీదారులు (ఎలిమినేట్ అయ్యే ప్రమాదంలో ఉన్నారు) సేవ్ కావడానికి తమ గురించిన రహస్యాలను బహిర్గతం చేస్తారు. కాసేపటి క్రితం మేకర్స్ షేర్ చేసిన ప్రోమోలో మందన ముందుగా బజర్ ని క్లిక్ చేసి దర్శకుడితో ఎఫైర్ కి సంబంధించిన తన రహస్యాన్ని బయటపెట్టింది.

ప్రముఖ దర్శకుడితో తనకున్న ఎఫైర్ గురించి చెబుతూ మందన కరిమి తన భర్త నుంచి విడిపోతున్న సమయంలో ఇలా జరిగిందని చెప్పింది. నేను ధైన్య‌ పరిస్థితిలో ఉన్న‌ప్పుడు నేను రహస్య సంబంధాన్ని కలిగి ఉన్నాను. మహిళల హక్కుల గురించి మాట్లాడే ప్రముఖ దర్శకుడితో నా సంబంధం కొన‌సాగింది... అని తెలిపింది. అయితే అత‌డు త‌న‌ని గ‌ర్భిణిని చేసాక విడిచిపెట్టాడ‌ని కూడా వెల్ల‌డించింది.

రియాలిటీ పిచ్చి పీక్స్ ..

రియాలిటీ షోలు చిత్ర‌విచిత్ర విన్యాసాల‌కు ఆల‌వాలంగా మారాయి. సాంప్ర‌దాయ‌వాదుల‌కు చిర్రెత్తేలా కొత్త కొత్త విన్యాసాల్ని క‌నిపెట్టి మ‌రీ మోడ్ర‌న్ డే యూత్ ని ఆక‌ర్షించేందుకు రియాలిటీ షో నిర్వాహ‌కులు ప‌డుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. నేటి జ‌న‌రేష‌న్ పూర్తిగా పాశ్చాత్య ధోర‌ణికి అల‌వాటు ప‌డేందుకు ఈ విష సంస్కృతి స‌హ‌క‌రిస్తోందని సామాజిక కర్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నా దానిని ప‌ట్టించుకునే నాథుడే క‌రువాయే!

ఇక రియాలిటీ షోల్లో కంగ‌న లాక్ అప్ మ‌రో లెవ‌ల్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అస‌లే కంగ‌న‌కు ఏక్తా క‌పూర్ లాంటి డైన‌మైట్ జోడీగా కుద‌ర‌డంతో బుల్లితెర‌పైనే మెంట‌ల్ హై క్యా చూపిస్తున్నారు.