Begin typing your search above and press return to search.
బుల్లి తెర నుంచి వెండి తెరకెక్కిన భామలు!
By: Tupaki Desk | 29 Nov 2022 6:35 AM GMTబుల్లి తెర నుంచి పెద్ద తెరకి ప్రమోట్ అయిన భామలు చాలా మందే ఉన్నారు. అందరూ స్టార్లు అవ్వాలని రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతుంటారు. అందుకు బుల్లి తెర మంచి వేదికగా చెప్పొచ్చు.
నేరుగా సినిమాల్లో అవకాశాలు రాని చాలా మంది ముందుగా సీరియళ్లు...యాంకర్లగా కెరీర్ ప్రారంభించి అటుపై హీరోయిన్లగా ప్రమోట్ అయ్యారు. అలాంటి భామలలో కొందరు గురించి చర్చిస్తే...నేడు ఆ హీరోయిన్లు కొన్ని పరిశ్రమల్నే శాషిస్తున్నారని తెలుస్తోంది.
ముందుగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ముందు బుల్లి తెరపైనే ఎంట్రీ ఇచ్చింది. 2003లో హీరోయిన్ గా పరిచయం అవ్వడానికి ముందు ఓ మలయాళం ఛానెల్ లో ప్రజెంటర్ గా...ఫ్యాషన్..లైఫ్ స్టైల్..సౌందర్యోత్పత్తులు..నగలు.. గ్యాడ్జెట్లు సెలబ్రిటీల వంటి విషయాలు పంచుకునేది. ఆ తర్వాత వెండి తెరపై మెరిసింది. నేడు హీరోయిన్ తమిళ ఇండస్ర్టీనే ఏల్తోంది.
అలాగే సాయి పల్లవి 'ఢీ 'షోలో డాన్సర్ గా పరిచయమైంది. తనలో ఆ స్కిల్స్ తో నే ముందుగా చిన్న తెరపై ఫేమస్ అయింది. దీంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ తల్లిదండ్రుల కోరిక మేరకు మెడిసిన్ పూర్తిచేసే వరకూ సినిమాల్లోరి రానని ఒట్టు పెట్టుకుంది. డాక్టర్ డిగ్రీ తీసుకున్న తర్వాతే నటిగా తెరంగేట్రం చేసింది. అలాగే 'మహానటి'గా ఫేమస్ అయిన కీర్తిసురేష్ కూడా సినిమల కంటే ముందు సీరియళ్లలో నటించింది.
ఆమె తల్లి మేనక మలయాళంలో పెద్ద నటి. కానీ మేనక కుమార్తె బాగా చదువుకుని వేరే రంగంలో స్థిరపడాలి అని కోరుకునేవారు. కానీ కీర్తికి చిన్న నాటినుంచి సినిమాలంటే ఆసక్తి. ఆపిచ్చితోనే సీరియళ్లు చేసింది. అటుపై సినిమాల్లోకి వచ్చింది. ఇక 11 ఏళ్లకే క్విజ్ ప్రోగ్రామ్ తో మలయాళ ఛానెల్ లో యాంకర్ గా మారింది నజ్రియా నజీమ్.
ఆ తర్వాత చదువు కొనసాగిస్తూనే పార్ట్ టైమ్ గా ఛానెల్ ఉద్యోగం చేసేది. అంతకు ముందు బాల నటిగాను కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత రాజా రాణి తో పెద్ద హీరోయిన్ అయిపోయింది. ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ముందుగా హిందీలో కొన్ని సీరియల్స్ చేసింది . 'కుంకుమ భాగ్య' సీరియల్ తో పాన్ ఇండియాలోనే ఫేమస్ అయింది. సీరియల్ నటిగా మరింత బిజీ అయింది. ఆ తర్వాత తెలుగు సినిమా 'సీతారామం'తో ఓ వెలుగు వెలిగింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.