Begin typing your search above and press return to search.
దేవుడి వేషాల నుంచి నేరుగా బ్రా ఫిట్టర్ పాత్రలోకి అంటూ నటి వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 28 Jan 2022 10:46 AM GMTటీవీ నటి శ్వేత తివారీ చిక్కుల్లో పడ్డారు. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘దేవుడు నా బ్రా కొలతలు తీస్తున్నాడు’ అంటూ ఆమెచేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. దీనిపై హిందూసంస్థలు భగ్గుమన్నాయి.
టీవీ నటి శ్వేత తివారీ నటించిన వెబ్ సిరీస్ ‘షో స్టాపర్’ ప్రమోషన్ లో భాగంగా భోపాల్ లో విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ హోంమంత్రి ఖండించారు. ఈ వీడియోను మధ్యప్రదేశ్ కు చెందిన సంకేత్ పాఠక్ అనే విలేఖరి ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై శ్వేత తివారీ క్షమాపణలు చెప్పాలంటూ హిందూ మత సంస్థలు డిమాండ్ చేశాయని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
-శ్వేత తివారీ ఎవరంటే?
శ్వేత తివారీ హిందీ సీరియల్ నటి. ‘కసౌటి జిందగీ కే’ , బేగు సరాయి లాంటి హిందీ సిరియళ్లలో నటించారు. ఆమె గత ఏడాది ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోన్ కే ఖిలాడీ 11 అనే రియాలిటీ షో లో కూడా పాల్గొన్నారు. ఈ షోలో ఆమె టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరు. ఇది స్టంట్ లతో కూడిన రియాలిటీ షో. సెప్టెంబర్ 2021లో ముగిసిన ఈ టీవీ షోలో జిజిలానీ విజేతగా నిలిచారు.
వెబ్ సిరీస్ లో శ్వేతతోపాటు నటిస్తున్న సౌరభ్ రాజ్ జైన్ బ్రా ఫిట్టర్ పాత్రను పోషిస్తున్నారు. ఇది ఫ్యాషన్ రంగానికి చెందిన వెబ్ సిరీస్. సౌరభ్ కృష్ణుడి తరహా పాత్రల్లో నటించారు. దాంతో పై జోక్ వేస్తూ ‘దేవుడి వేషాల నుంచి నేరుగా బ్రా ఫిట్టర్ పాత్రలోకి ’ అంటూ శ్వేత చలోక్తి విసిరారు. వీరిద్దరితోపాటు రోహిత్ రాయ్ కూడా ఈ సిరీస్ లో నటిస్తున్నారు.
భోపాల్ లో కొన్ని హిందూ సంస్థలు శ్వేత తివారీ ఫొటోలను మంటల్లో కాల్చాయి. ఆమె క్షమాపణలు చెప్పాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయని రుచి త్యాగి అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అర్థరహితంగా చౌకబారుగా ఉన్నాయని కొందరు యూజర్లు ట్వీట్ చేశారు.