Begin typing your search above and press return to search.
వైరల్: కరోనాకు పారాసిటమాల్ వాడానన్న నటి
By: Tupaki Desk | 21 March 2020 7:05 AM GMTకరోనాకు పారాసిటమాల్ టాబ్లెట్ పనికొస్తుందన్న ఓ టాప్ మోస్ట్ రాజకీయ నేత మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాని పై బోలెడు సెటైర్లు పడ్డాయి. కరోనా భయంతో శాస్త్రవేత్తలు మందు కనిపెట్టలేక.. సాధ్యం కాక తలపట్టుకుంటుంటే పారాసిటమాల్ తో తగ్గిస్తానంటున్న నేతల మాటలపై సెటైర్లు పేలాయి.
తాజాగా ఓ హాలీవుడ్ నటి, జేమ్స్ బాండ్ గర్ల్ ఓల్గా కురిలెంకో ఓ సంచలన విషయం చెప్పింది. కరోనా లక్షణాల్లో జ్వరం ఒకటి కాగా.. దాన్ని కంట్రోల్ చేయడానికి పారాసిటమాల్ బాగా పనిచేస్తుందని ఆమె చెప్పింది. ఇటీవలే తనకు కరోనా పాజిటివ్ అని ఆమె తెలిపింది. ప్రస్తుతం కోలుకుంటున్న ఆమె తనకు పారాసిటమాల్ బాగా పనిచేస్తుందని తెలిపింది.
కరోనా బాధితులు జ్వరం, నొప్పి అధికంగా ఉంటే పారాసిటమాల్ తీసుకోవాలని సూచించారని.. తాను వాటినే తీసుకున్నట్లు ఆమె తెలిపారు. రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే కరోనాను జయించొచ్చని.. శక్తిని పెంచుకోవడం కోసం విటమిన్ బీ5, విటమిన్ సి, విటమిన్ ఈ, జింక్ టాబ్లెట్లను వేసుకున్నట్టు ఓల్గా తెలిపింది.
విటమిన్లతో కరోనా నయం కాదని.. కేవలం రోగ నిరోధక శక్తిని మాత్రమే పెంచుతాయని తెలిపింది. జ్వరం తగ్గిందని. మిగిలిన లక్షణాలు తగ్గితే కరోనాను జయించినట్టేనని తెలిపింది.