Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో ఏది శాశ్వతం కాదు. ప్రతిదీ మనసుతో చూడొద్దు: యాక్ట్రెస్ జరీన్

By:  Tupaki Desk   |   19 Jun 2021 5:30 AM GMT
ఇండస్ట్రీలో ఏది శాశ్వతం కాదు. ప్రతిదీ మనసుతో చూడొద్దు: యాక్ట్రెస్ జరీన్
X
సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు హీరోయిన్స్ వారి ఫస్ట్ సినిమా గురించి.. వారు ఎదుర్కొన్న కెమెరా ఫియర్ గురించి.. లేదా ఇండస్ట్రీలోకి వచ్చాక ఎదుర్కొన్న అవమానాల గురించి టైం వచ్చినప్పుడు బయటపెడుతుంటారు. తాజాగా అవమానం లాంటి పరిస్థితి ఫేస్ చేసానని అంటూ ఫస్ట్ సినిమా టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సల్మాన్ ఖాన్ సరసన "వీర్" (2010) సినిమాతో కెరీర్ ప్రారంభించింది బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ జరీన్ ఖాన్. అయితే ఆ సినిమా విడుదలైన తర్వాత తన బాడీ షేమింగ్ గురించి ఫేస్ పలు ఇన్సిడెంట్స్ ఫేస్ చేసినట్లు చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలోని సీనియర్స్ తన క్యారెక్టర్ కోసం బరువు పెరగాలని చెప్పారట. అయితే తాజాగా ఇంటర్వ్యూలో యాక్టర్స్ రూపం బట్టి ఇండస్ట్రీలో కెరీర్ డిసైడ్ అవుతుందా..? అనే అంశంపై జరీన్ మాట్లాడుతూ.. "ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అదే ప్రధానం అని చెప్పను కాని పరిశ్రమలో బాడీకి ఇంపార్టెన్స్ ఉంది. నా కెరీర్ ప్రారంభంలో ఈ విషయం కష్టమే అనిపించింది. అలాగే వీర్ సినిమా టైంలో నా బరువే నేషనల్ టాపిక్ అయింది. "వీర్" సినిమా వచ్చాక జరీన్ ను హీరోయిన్ కత్రినా కైఫ్‌తో పోల్చారట. అప్పటినుండి తన వర్కౌట్స్ పై దృష్టిపెట్టినట్లు తెలిపింది.

'అయితే వీర్ సినిమా టైంలో ప్రతిఒక్కరూ నా బరువు గురించి మాట్లాడుతున్నారు. నాకు ఏం అర్థం కాలేదు - నా బరువు ఎందుకు పెద్ద సమస్యగా చూస్తున్నారు.. వారు చెప్పారు కాబట్టి నేను బరువు పెరిగాను కదా.. ఆ టైంలో నా వయసు 21సంవత్సరాలు. ఇండస్ట్రీ గురించి నాకేమి తెలియదు. కేవలం స్టార్ హీరోతో వర్క్ చేస్తున్నానని మాత్రమే తెలుసు. అలాగే నా మొట్టమొదటి షాట్ జరిగినప్పుడు కెమెరా ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. ఓ మూగదానిలా ఉండిపోయాను. సీనియర్స్ తో పనిచేసేటప్పుడు వారు సూచనలు ఇస్తుంటారు. వారు చెప్పినట్లుగా నేను ఫాలో అయ్యాను. కానీ తీరా నా లుక్స్ నా బరువు అన్ని నాకే రివర్స్ అయ్యాయి.' అని జరీన్ పేర్కొంది.

అలాగే కొంతకాలం అవకాశాలు లేకపోయేసరికి ఇక్కడ ఏది శాశ్వతం కాదని పరిశ్రమ నాకు నేర్పింది. ప్రతి సినిమాతో మనకు అవగాహనలు మారుతుంటాయి. ఏ ఒక్కటి మనసుకు దగ్గరగా తీసుకోకూడదు" అని అమ్మడు తెలిపింది. జరీన్ చివరిసారిగా "హమ్ భీ అకెలే తుమ్ భీ అకెలే" అనే సినిమాలో కనిపించింది.