Begin typing your search above and press return to search.

చైనాను బండబూతులు తిట్టిన నటులు

By:  Tupaki Desk   |   2 April 2020 12:30 PM GMT
చైనాను బండబూతులు తిట్టిన నటులు
X
చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తోంది. అమెరికాను అతలాకుతలం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే దీన్ని చైనీస్ వైరస్ అంటున్నారు. లక్షలాది మందిని బలితీసుకుంటూ దేశాలకు దేశాలే క్వారంటైన్ లోకి నెట్టిన ఈ కరోనా వైరస్ ముమ్మాటికీ చైనా దేశపు సృష్టి అనేవాళ్లు లేకపోలేదు. చైనా వాళ్ల ఆహారపు అలవాట్లతోనే ఈ వైరస్ పుట్టిందంటారు.

కరోనా వైరస్ పుట్టుకకు కారణమైనా చైనీయులపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి సంధ్య మృదులు చైనీయులపై బండబూతులు తిట్టారు. 'జంతువులను కాదు.. మిమ్మల్ని మీరే తినండి.. దరిద్రం వదిలిపోతుంది' అని సంధ్య ఘాటుగా ట్వీట్ చేసింది.

ఇక ఈ ట్వీట్ చూసిన మరో నటి రవీనా కూడా చైనా తీరుపై దుమ్మెత్తిపోసింది. 'కరోనాతో ఇంతమంది చచ్చినా.. ఇంత నష్టం వాటిల్లినా చైనీయులు మారడం లేదు. జంతువులను బలిగొనడం.. వన్య ప్రాణులపై జరిగే నేరాల్లో ప్రపంచంలోనే చైనా అత్యంత చెత్త దేశం' అని తూర్పారపట్టారు.

ఇప్పుడు ఇంతమందిని లాక్ డౌన్ లో పెట్టి.. ఇంత నష్టం చేసిన కరోనాపై, పుట్టించిన చైనీయులపై మరింతమంది నటులు ముందుకొచ్చి తిట్టడం ఖాయంగా కనిపిస్తోంది.