Begin typing your search above and press return to search.

హాట్‌ హాట్‌ శర్మ.. మూడు పాయింట్లు

By:  Tupaki Desk   |   9 April 2015 3:30 AM GMT
హాట్‌ హాట్‌ శర్మ.. మూడు పాయింట్లు
X
తెలుగులో ఇప్పుడు సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి వంటి సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. సో, ఈ సినిమా రిజల్ట్‌ అమ్మడికి మాంచి మాంచి అవకాశాలే తెచ్చిపెడుతుంది మరి. సినిమాల సంగతి అటుంచితే.. పిటపిటలాడుతున్న అందగత్తె, ఇలాంటి మనస్సులను దోచుకోవాలని చాలామంది చూస్తుంటారు.. మరి ఈమెను పడేయాలంటే ఎలాగంటారూ?

''అబ్బే నన్ను లైన్‌లో పెట్టడం అంత వీజీ కాదు. దానికి ఓ ఫార్ములా ఉంది. ఆ మూడూ సెట్టయితేనే నాతో సెట్టయ్యేది'' అంటూ తన డ్రీమ్‌ బాయ్‌ ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. కొంపతీసి రాశి, నక్షత్రం, గోత్రం వంటివి చూసుకోవాలి అంటుందా ఏంటి? అబ్బే అంతలేదు. ''ముందుగా నన్ను చేసుకోబోయే వాడు, నన్ను ప్రేమించేవాడు, నా ప్రియుడు, నా రాకుమారుడు.. ఒక జంతు ప్రేమికుడు అయ్యుండా''.. అంటే అమ్మడు టెంపర్‌లో కాజల్‌ టైపులో యానిమల్‌ లవర్‌ అనమాట. ''నాలాగే తెలుగు సినిమాలను, అన్ని బాషల సినిమాలను ప్రేమించాలి''. గుడ్‌.. ''మూడో క్వాలిటీ ఏంటంటే.. చాలా హానెస్ట్‌ అయ్యుండాలి'' అమ్మో ఇది మాత్రం కష్టమే తల్లోయ్‌. మరి ఎవరి దగ్గరయినా ఈ మూడు పాయింట్లూ కరెక్ట్‌గా ఉంటే.. హాట్‌ హాట్‌ శర్మ గారు ప్రేమలో పడిపోవడానికి రెడీ!!