Begin typing your search above and press return to search.
ఇక్కడ చెడ్డవాళ్లు కూడా ఉన్నారు
By: Tupaki Desk | 29 Jun 2019 9:29 AM GMTతెలుగు ప్రేక్షకులకు 'హార్ట్ ఎటాక్' తో పరిచయం అయిన ఉత్తరాది ముద్దుగుమ్మ అదాశర్మ టాలీవుడ్ లో అడపా దడపా చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. అవకాశం వచ్చినప్పుడు తెలుగులో మాత్రమే కాకుండా తమిళ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా ఈమె నటిస్తూ ఉంది. ఈ అమ్మడు తాజాగా రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి' చిత్రంలో నటించింది. నిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా అదాశర్మ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'కల్కి' చిత్రంలో డాక్టర్ పద్మ పాత్రలో కనిపించిన అదాశర్మ తన పాత్రపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. ఆదాశర్మ మాట్లాడుతూ.. కెరీర్ లో మొదటి సారి డాక్టర్ పాత్రను పోషించాను. డాక్టర్ పాత్ర అని చెప్పగానే చాలా ఆనందించాను. ఇప్పటి వరకు నా కెరీర్ లో చేయని పాత్ర కల్కిలో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పాత్ర పరిధి ఎంత అనే విషయాన్ని పట్టించుకోకుండా నటనకు ఆస్కారం ఉందా అనే విషయాన్ని చూసి సినిమాలను ఎంపిక చేసుకుంటాను. మంచి పాత్రల కోసం చూడటం వల్లే కాస్త సినిమాల మద్య గ్యాప్ వస్తుందని అదాశర్మ చెప్పుకొచ్చింది.
ఇక ఈ చిత్రంలో రాజశేఖర్ గారితో నటించడం నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ప్రోత్సాహంతో నేను నా పాత్రను మరింతగా పండించగలిగాను. ఆయనకు నటన అంటే ప్రాణం. అంతగా సినిమా కోసం కష్టపడతాడు. సెట్లో అంతా కూడా నాతో చాలా కంఫర్ట్ గా వ్యవహరించేవారు. ఇండస్ట్రీలో కొందరు చెడ్డ వారు కూడా ఉంటారు. చెడ్డవారితో వర్క్ చేసే సమయంలో ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నా కెరీర్ లో రాజశేఖర్ మరియు పూరి జగన్నాధ్ గారి లాంటి మంచి వారిని చూడటంతో పాటు కొంతమంది చెడ్డ వారిని కూడా చూశాను. ఇక్కడ చెడ్డ వారు ఉన్నంత మాత్రాన కెరీర్ ను వదిలేయాలనుకోలేదు. మంచి వారు ఎక్కువగా ఉండి మంచి జరుగుతున్నప్పుడు చెడును ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ అదా శర్మ మెచ్యూర్డ్ గా మాట్లాడింది.