Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బోటుపై బ్యూటీ బికినీ అందాలు

By:  Tupaki Desk   |   22 April 2019 7:15 AM GMT
ఫోటో స్టొరీ: బోటుపై బ్యూటీ బికినీ అందాలు
X
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే భామలలో అదా శర్మ ముందు వరసలో ఉంటుంది. జస్ట్ హాట్ ఫోటో షూట్లు చేయడమే కాదు కికీ ఛాలెంజ్ లాంటివి కూడా అవలీలాగా చేసిపారేస్తూ ఈ జెనరేషన్ బ్యూటీ అనిపించుకుంటుంది. కఠినమైన కసరత్తులు చేస్తూ ఫిట్ గా ఉంటుంది కాబట్టి అమ్మాయిలే అసూయపడేంత పర్ఫెక్ట్ షేపులో ఉంటుంది. ఇక అబ్బాయిలైతే అదా అందాల ఫోటోలను చూసి లైకుల మీద లైకులు కొడుతూ ఉంటారు.

తాజాగా ఈ సుందరి 'మ్యాన్' అనే మ్యాగజైన్ ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజిపై తళుక్కున మెరిసింది. ఈ సంచికలో 'అల్లరిపిల్లగా మారిన అదా శర్మ' అనే ఒక ఫీచర్ కూడా ఉందట. అదే విషయాన్నీ కవర్ పేజిపైనే వెల్లడించారు. ఇక ఫోటో సంగతి మాట్లాడుకుంటే లైట్ గ్రీన్ కలర్ బికినీ ధరించి.. సిల్వర్ కలర్ జాకెట్ ను ఒంటికి వేసుకోకుండా పరువాల ప్రదర్శనను అడ్డుకోకుండా మణికట్టుకు జస్ట్ అలా వేసుకుంది. అయినా రిస్టుకు వేసుకోవాల్సింది రిస్ట్ బ్యాండ్.. లేదా ఏదో ఒక బ్యాంగిల్. మ్యాన్ మ్యాగజైన్ వారు అందుకే నేమో అదా అల్లరి చేస్తోంది అని పెద్ద ఆర్టికల్ రాసినట్టున్నారు.

ఇక హెయిర్ స్టైల్ కొత్తగా ఉంది. బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉండడంతో ట్రెండీగా అనిపిస్తోంది. ఒక చేతిని కాలిమీద పెట్టుకోవడం.. మరో చేతిని తన కురులు సవరించినట్టుగా పెట్టుకోవడంతో బాడీ లాంగ్వేజ్ స్టైలిష్ గా ఉంది. సముద్రం లో ఒక బోటు.. ఆ బోటుపై అదా.. సెటప్ అంతా కేక. ఈ ఫోటోలో అసలు హైలైట్ వేరే ఉంది. కళాపోషణ పుష్కలంగా ఉన్న మారాజులకు మళ్ళీ ప్రత్యేకంగా అదేంటో చెప్పాల్సిన పనే లేదు. అయినా గంటల తరబడి ఈ భామలు జిమ్ములో కఠినమైన కసరత్తులు ఇటువంటి ఫోటోల కోసమే కదా. చూసేయండి..!