Begin typing your search above and press return to search.

పూరి హీరోయిన్ బ‌తిమాలుతోంది?!

By:  Tupaki Desk   |   5 Nov 2018 4:24 AM GMT
పూరి హీరోయిన్ బ‌తిమాలుతోంది?!
X
నితిన్ స‌ర‌స‌న `హార్ట్ ఎటాక్` సినిమాలో న‌టించింది అదాశ‌ర్మ‌. పూరి డిస్క‌వ‌రీగా పాపుల‌రైంది. మొద‌టి సినిమాతో చ‌క్క‌ని న‌టి అన్న పేరు తెచ్చుకుంది. అందానికి అందం.. అభిన‌యం .. డ్యాన్సింగ్ ట్యాలెంట్ ఉన్నా ఎందుక‌నో ఈ అమ్మ‌డికి ఆశించిన‌న్ని అవ‌కాశాలు అయితే రాలేదు. ద్వితీయ ప్ర‌య‌త్నంలో వ‌చ్చిన‌వ‌న్నీ రెండో లీడ్ పాత్ర‌లే. అల్లు అర్జున్ న‌టించిన `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రంలో అంత‌గా ప్రాధాన్య‌త లేని అతిధి రోల్‌ లోనే క‌నిపించింది. ఆ సినిమా హిట్ట‌యినా అదాకు మాత్రం ఛాన్సుల్లేవ్‌. అగ్ర‌హీరోలు పిలిచి అవ‌కాశాలివ్వ‌లేదు. కార‌ణం ఏదైనా త‌ర్వాత టాలీవుడ్‌ లో స‌రైన‌ సినిమా చేయ‌లేదు. అడివి శేష్ `క్ష‌ణం` ఛాన్స్ ఓ మ‌లుపు అనుకుంటే... ఆ సినిమా హిట్ట‌యినా త‌న‌కు మాత్రం క‌లిసి రాలేదు.. గ‌రం - సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ లాంటి చిత్రాలు ఫ్లాప్‌ లవ్వ‌డం అదాకి పెద్ద‌ మైన‌స్ అయ్యింది.

ఈ గ్యాప్‌లో అదా శ‌ర్మ‌ చెయ్య‌ని ప్ర‌య‌త్న‌మే లేదు. ఓవైపు బాలీవుడ్ - మ‌రోవైపు టాలీవుడ్ - కోలీవుడ్ ఇలా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ ఆశించినంత పెద్ద ఆఫ‌ర్ ఒక్క‌టీ లేదు. ఆ క్ర‌మంలోనే `అదా కి అదా` పేరుతో ట్విట్ట‌ర్‌ లో - ఇన్‌ స్టాలో బోలెడంత హంగామా క్రియేట్ చేస్తోంది. సోష‌ల్ మీడియా క్వీన్‌ గా నిరంత‌ర ఫోటోషూట్ల‌తో వేడెక్కిస్తూ యూత్‌కి ట‌చ్ లో ఉంది. అయినా టాలీవుడ్‌ లో మాత్రం మ‌రో అవ‌కాశం ద‌క్కించుకోలేక‌పోయింది.

ఎట్ట‌కేల‌కు హీరో రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న `క‌ల్కి` చిత్రంలో ఛాన్స్ ద‌క్కించుకుంది. ఈ ఛాన్స్ ద‌క్కినందుకు అదా చాలానే ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. ఇన్‌స్టాలో లేటెస్ట్ ఫోటోని షేర్ చేస్తూ ఇలా స్పందించింది. ``1920 - క‌మెండో 2 - హార్ట్ ఎటాక్ - స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి (ఎస్ ఓఎస్) - క్ష‌ణం.. ఇలా అన్నీ విభిన్న‌మైన చిత్రాల్లో న‌టించేందుకు ప్ర‌య‌త్నించాను. లేటెస్టుగా అవ‌కాశం ఇచ్చిన సినిమాలోనూ ఏదో ఒక కొత్త‌ద‌నం కోసం ప్ర‌య‌త్నిస్తాను. పెద్ద ప్రాజెక్టులో క‌థానాయిక‌గా అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సూప‌ర్ కూల్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 1920 త‌ర్వాత మ‌ళ్లీ నేను చేస్తున్న పీరియాడిక‌ల్‌ సినిమా ఇది. రాజ‌శేఖ‌ర్ గారు - నిర్మాత సి.క‌ళ్యాణ్ పెద్ద స్కేల్‌ పై ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతార‌న్న నమ్మ‌కం ఉంది. ఇంకా వేచి చూడ‌లేను.. మొద‌లెట్టేయాలి. మీ ప్రేమ‌ - ఆశీస్సులు కావాలి. క‌ల‌ల్లో జీవిస్తున్నా`` అంటూ సుదీర్ఘమైన లేఖ‌నే రాసింది. మొత్తానికి అదా శ‌ర్మ ఇంకా టాలీవుడ్ అవ‌కాశాల కోసం ఎంత‌గా పాకులాడుతోందో అర్థం చేసుకోవాల్సి ఉంది. క‌నీసం త‌న‌లోని క‌సి చూశాక అయినా మ‌న ద‌ర్శ‌క‌నిర్మాతలు పిలిచి స‌రైన‌ అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోతారా? అన్న‌ది చూడాలి.