Begin typing your search above and press return to search.

ఆ బిగువులతో ఎర వేస్తున్న కుర్ర‌బ్యూటీ

By:  Tupaki Desk   |   14 Jun 2020 9:19 AM IST
ఆ బిగువులతో ఎర వేస్తున్న కుర్ర‌బ్యూటీ
X
ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ అందాల్ని ఎర‌వేసే త‌త్వం సోష‌ల్ మీడియాల్లో పెరుగుతోందా? అంటే అవున‌నే తాజా ప‌రిణామం చెబుతోంది. ట్విట్ట‌ర్.. ఇన్ స్టాగ్రమ్.. టిక్ టాక్ .. ఇత‌ర సామాజిక మాధ్య‌మాల్లో విశృంఖ‌లత ఆ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. ఈ త‌ర‌హా ఫోబియోకి సెల‌బ్రిటీలు సామాన్యులు అనే తేడా క్ర‌మేణా చెరిగిపోతోంద‌నే చెప్పాలి. స‌రిగ్గా ఇదే పాయింట్ రెచ్చిపోయి వ‌లువ‌లు వ‌లిచేసేంత వ‌ర‌కూ వెళుతోంది.

ఇదిగో గ‌త రెండు మూడేళ్లుగా టాలీవుడ్ లో స‌రైన ఆఫ‌ర్లు లేవు ఈ అమ్మ‌డికి. ఆ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాల్లో ఇష్ఠారీతిన చెల‌రేగుతూ నిరంత‌రం యూత్ కి పిచ్చెక్కిస్తోంది. ముఖ్యంగా టీనేజర్ల‌లో ఫాలోయింగ్ పెంచుకునే ఎత్తుగ‌డ‌ల‌తో ట‌చ్ లో ఉంటోంది. ఇన్ స్టా.. ట్విట్ట‌ర్ లో అదాశ‌ర్మ ఫాలోయింగ్ చూస్తే మ‌తి చెడాల్సిందే. అక్క‌డ అంతా యూత్. ఇంకా చెప్పాలంటే ఓన్లీ టీనేజ‌ర్స్.

నిరంత‌రం వేడెక్కించే ఫోటోలు వీడియోల్ని షేర్ చేస్తూ ఈ అమ్మ‌డు ఓ రేంజులోనే ఫాలోయింగ్ ద‌క్కించుకుంది. అయితే ఎంత‌గా కొంటె వేషాలు వేసినా ఈ అమ్మ‌డిని పిలిచి అవ‌కాశం ఇచ్చిన నాధుడే లేక‌పాయే! గ‌త ఏడాది ఓ హిందీ థ్రిల్ల‌ర్ లో న‌టించిన అదా శ‌ర్మ‌కు ఆ త‌ర్వాతా స‌రైన ఆఫ‌ర్లు లేనేలేవు. ఆ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డు ల‌వ్ లో ప‌డింద‌న్న ప్ర‌చారం వేడెక్కించింది.

కమెండో 2 .. క‌మెండో 3 చిత్రాల్లో న‌టించిన అదా శ‌ర్మ ఈ ఫ్రాంఛైజీ హీరో విద్యుత్ జ‌మ్వాల్ తో నిండా ల‌వ్ లో మునిగింద‌న్న ప్ర‌చారం సాగింది. క‌మెండో 2లో తేరే దిల్ మెయిన్ లాంటి బాలీవుడ్ స్టైల్ రొమాంటిక్ సాంగ్ లో అదా ఆర‌బోసి ఆక‌ట్టుకుంది. ఈ రొమాంటిక్ సాంగ్ లో విద్యుత్ - అదా మ‌ధ్య ల‌వ్ కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుటైంది.

ప్ర‌స్తుతం ఆఫ‌ర్లు ఏవీ లేవు. ఆ క్ర‌మంలోనే వెబ్ సిరీస్ ల‌పైనా అమ్మ‌డు దృష్ఠి సారించింద‌ట‌. సోష‌ల్ మీడియాల్లో అదా అన్ లిమిటెడ్ ట్రీట్ ఇప్ప‌టికీ వెర్రెత్తిస్తోంది. తాజాగా మ‌రోసారి అదా రెచ్చిపోయింది. అస‌లు టాప్ ధ‌రించిందా లేదా? అన్నంత‌గా చెల‌రేగిపోతూ రెడ్ హాట్ అందాల‌తో ఎర వేసిందిలా. అయినా .. ఆ బిగువుల సౌంద‌ర్యానికి దాసోహం కానిదెవ‌రు?