Begin typing your search above and press return to search.

కుర్రాళ్లు మ‌తి చెడి ఏదో అవ్వ‌రూ

By:  Tupaki Desk   |   31 Dec 2019 11:00 PM IST
కుర్రాళ్లు మ‌తి చెడి ఏదో అవ్వ‌రూ
X
అదా కి అదా ట్రీట్ గురించి తెలిసిందే. ఇన్ స్టా- ట్విట్ట‌ర్ మాధ్య‌మాల్లో అదా శ‌ర్మ రెగ్యుల‌ర్ ట్రీట్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ వేదిక‌పై రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌ను అప్ డేట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. అలాగే సామాజిక మాధ్య‌మాల ద్వారా ఈ అమ్మ‌డు నెల‌కు దాదాపు 30-50ల‌క్ష‌ల మేర ఆర్జిస్తోందిట‌.

అదంతా స‌రే కానీ.. యూత్ 31 మిడ్ నైట్ ట్రీట్ కి రెడీ అవుతుంటే అదాశ‌ర్మ మాత్రం ఎప్ప‌టిలానే అదిరిపోయే ఫోటోల‌తో ట్రీటిస్తోంది. ఇన్ స్టా వేదిక‌గా అదా షేర్ చేసిన ఓ ఫోటో అంత‌ర్జాలాన్ని హీటెక్కిస్తోంది. అదా నెవ్వ‌ర్ బిఫోర్ అన్నంత హాట్ గా క‌నిపిస్తోంది ఈ ఫోటోలో.

వైట్ అండ్ బ్లాక్ చార‌ల స్లీవ్ లెస్ బ‌నియ‌న్ లో క‌నిపించిన అదా ఎంతో తీరిగ్గా బెడ్ పై ఇలా ఫోజిచ్చింది. ఇక బాట‌మ్ లో పొట్టి నిక్క‌రు సంథింగ్ హాట్. వాట‌న్నిటినీ మించి అదా ఎక్స్ ప్రెష‌న్.. అద‌ర‌హో అనే చెప్పాలి. మ‌రీ ఇలాంటి ఫోజిస్తే యూత్ కి మ‌త్తు దిగిపోవ‌డం ఖాయం. కెరీర్ ప‌రంగా చూస్తే.. ఇటీవ‌లే అదా న‌టించిన క‌మెండో 3 రిలీజైంది. బైపాస్ అనే హార‌ర్ చిత్రంతోనూ ట్రీటిచ్చింది. ప్ర‌స్తుతం మ్యాన్ టు మ్యాన్ అనే సిరీస్ లో న‌టిస్తోంది.