Begin typing your search above and press return to search.

అదా.. ఫోటోషూట్స్ కి మాత్ర‌మే అంకితం

By:  Tupaki Desk   |   18 Feb 2020 8:00 AM IST
అదా.. ఫోటోషూట్స్ కి మాత్ర‌మే అంకితం
X
అదాశ‌ర్మ .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాల్లో స్పీడ్ గా ఉండేవాళ్ల‌కు అదా డియ‌రెస్ట్ ఫ్రెండ్. ఇన్ స్టాగ్ర‌మ్.. ట్విట్ట‌ర్ లో ఎంతో జోష్ తో నిరంత‌రం ఏదో ఒక కొత్త ట్రీట్ ఇస్తూనే ఉంది ఈ అమ్మ‌డు. రెగ్యుల‌ర్ గా మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్ల‌తోనూ వేడెక్కిస్తూనే ఉంది.

ఇక రెగ్యుల‌ర్ హీరోయిన్ల‌తో పోలిస్తే అందాల ఆర‌బోత‌కు అదా ఎప్పుడూ అడ్డు చెప్ప‌దు. త‌న ఫోటోషూట్ల‌లో పెచ్చుమీరిన ఎక్స్ పోజింగ్ ప్ర‌తిసారీ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా అలాంటి ఫోటోషూట్ ఒక‌టి సోష‌ల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. ప్ర‌ఖ్యాత ఎఫ్‌.హెచ్.ఎం క‌వ‌ర్ పేజీ ఫోటో ఇది. అదా అందాల ఆర‌బోత పిచ్చెక్కించింద‌నే చెప్పాలి. బ్లాక్ క‌ల‌ర్ థై స్లిట్ ఫ్రాకులో గుబులు రేకెత్తించింది.

అన్న‌ట్టు అదా ఇలా ఫోటోల‌తోనే ఎన్నాళ్లు నెట్టుకొస్తుంది? సినిమాలు చేయ‌దా? తెలుగులో కెరీర్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా న‌టిస్తున్నా అక్క‌డా చెప్పుకోద‌గ్గ కెరీర్ లేదు. క‌నీసం త‌మిళం.. మ‌ల‌యాళంలో ట్రై చేసినా ఏదో ఒక ఆఫ‌ర్ ద‌క్కేది. కానీ ఎందుక‌నో ఈ అమ్మ‌డు సినిమాల‌కు దూరంగా ఉంది. ఇక‌ అదా శ‌ర్మ షేర్ చేసే ఫోటోలు.. డ్యాన్సుల‌కు నెటిజ‌నులు ఒక్కొక్క‌రూ ఒక్కోలా కామెంట్ల‌ను పోస్ట్ చేస్తున్నారు. తైత‌క్క‌లు చూడ‌లేం బాబోయ్! అంటూ ఘాటు వ్యాఖ్య‌ల్ని పోస్ట్ చేసే కొంటె ఫ్యాన్స్ ని అదా అదుపు చేయ‌లేక‌పోతోంది పాపం!