Begin typing your search above and press return to search.

ఈ సారైనా కొడతావా పాపా?

By:  Tupaki Desk   |   24 Feb 2016 3:30 PM GMT
ఈ సారైనా కొడతావా పాపా?
X
ఇప్పుడున్న హీరోయిన్లలో ఆదాశర్మని ఒకరకంగా అందరికంటే లక్కీ అనాలి. అందం ఉంది, దాన్ని గ్లామరస్ గా ప్రొజెక్ట్ చేసుకునే తెగువ ఉంది, ఛాన్సులు ఉన్నాయి, చేసిన సినిమాలు మంచి హిట్ అవుతున్నాయ్ కూడా. కానీ అవేమీ ఆదా కెరీర్ కి మాత్రం ఉపయోగపడ్డం లేదు. దీనికి తోడు చిన్నా చితకా పనికిమాలిన పాత్రలతో పరువు కూడా పోగొట్టుకుంటోంది.

పూరీ జగన్నాథ్ మూవీ హార్ట్ అటాక్ లో మంచి పాత్రతోనే అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల్లో అసలు ఏ మాత్రం ప్రాధాన్యత రోల్స్ కారణంగా వెనకబడింది. రీసెంట్ గా విడుదలైన గరం మూవీ అయితే.. మొదటిసారిగా ఆదాశర్మ కెరీర్ లో డిజాస్టర్ గా అకౌంట్ లోకి చేరింది. కానీ ఈ వారం విడుదల కానున్న క్షణం మూవీలో ఆదాశర్మ ఒక్కతే హీరోయిన్. అంతేకాదు పెర్మామెన్స్ స్కోప్ ఉన్న ప్రాధాన్యత పాత్ర కూడా. అడివిశేష్ కి మాజీ లవర్ గా నటిస్తోంది. యాంకర్ అనసూయ కూడా క్షణంలో కనిపించనున్నా.. ఆమెది గ్లామర్ రోల్ కాదు. ఇటు పెర్ఫామెన్స్ అటు గ్లామర్ రెండూ.. ఆదా అకౌంట్ లోకే వెళ్తాయి.

అందుకే క్షణంతో తనను తాను ప్రూవ్ చేసుకునే అరుదైన అవకాశం ఆదాశర్మకు వచ్చింది. ఈ అవకాశాన్ని ఆదా సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి. ఎందుకంటే.. ఇప్పటికే ఈమె కెరీర్ స్లంప్ లో ఉందనే చెప్పాలి. ఇప్పుడు పెద్ద బ్యానర్ లో వస్తున్న చిన్న బడ్జెట్ చిత్రంగా మంచి అంచనాలతో విడుదలవుతున్న క్షణం క్లిక్ అయితే మాత్రం.. ఆదా కెరీర్ కి బూస్ట్ లభించినట్లే.