Begin typing your search above and press return to search.

ఏంటో గిలి గిలిగా గ‌జిబిజిగా ఉంది

By:  Tupaki Desk   |   23 Sep 2015 5:40 AM GMT
ఏంటో గిలి గిలిగా గ‌జిబిజిగా ఉంది
X
1920 అనే హార‌ర్ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది అదాశ‌ర్మ‌. సినిమా అన్నా, డ్యాన్స్ అన్నా చెబి కోసేసుకుంటుంది ఈ అమ్మ‌డు. క్యూట్ అప్పియ‌రెన్స్‌, హాట్ అప్పీల్ ఉన్న అమ్మ‌డుగా పేరు తెచ్చుకుంది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో హార్ట్ ఎటాక్ చిత్రంలో న‌టించింది అదా. టాలీవుడ్‌లో మొద‌టి ప్ర‌య‌త్న‌మే విజ‌యం అందుకుని మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించింది.

ఆ వెంట‌నే బ‌న్ని స‌ర‌స‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో అవ‌కాశం అందుకుంది. పెళ్లి కుదిరాక ప్లేటు ఫిరాయించే పాపాయి గా బాగానే ఆక‌ట్టుకుంది. ఏదైతేనేం .. ఇప్పుడున్న ఠ‌ఫ్ కంపిటీష‌న్‌ లో త‌న‌ని తాను స్టార్ హీరోయిన్‌ గా ఆవిష్క‌రించుకోవాలంటే కొత్త అస్ర్తాల్ని ఒర‌లోంచి తీయాల‌ని డిసైడ్ అయిన‌ట్టుంది. ఇదిగో ఇక్క‌డున్న ఫోటో షూట్ చూస్తే ఆ సంగ‌తి ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. టాలీవుడ్ స్ప‌యిసీ కోరుకుంటోంది. అందుకు త‌గ్గ‌ట్టే హాట్ అప్పీల్‌ తో ఫోటో షూట్‌ లో విరుచుకుప‌డితే ఎలా ఉంటుంది? అని ప్లాన్ వేసి ఇలా క‌నిపించింది.

అదాశ‌ర్మ కొత్త ప్ర‌య‌త్నాలు బావున్నాయ్‌. అయితే త‌న‌కి ఆరంభ‌మే అవ‌కాశం ఇచ్చిన పూరి జ‌గ‌న్నాథ్ కానీ, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కానీ త‌న‌ని ఓ చూపు చూస్తేనే మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ వ‌చ్చేది. టాప్ హీరోయిన్ స్లాట్‌లో కి వ‌చ్చేది. అంత‌వ‌ర‌కూ ఏ ప్ర‌య‌త్నం చేసినా వృథానే. చూద్దాం.. ఇలా వాలు చూపుల‌తో, స్మ‌యిలీ పేస్‌తో ఆక‌ట్టుకోవాల‌న్న ప్ర‌య‌త్నం బావుంది. పొట్టినిక్క‌రు, వైట్ టాప్‌ తో మ‌తి చెడ‌గొట్టింది.

For More Photos : http://www.tupaki.com/photogallery/actress/Adah-Sharma-Photo-Shoot-Photos/1101/1