Begin typing your search above and press return to search.
మాజీ లవర్స్ మధ్యలోకి అదా కూడా..
By: Tupaki Desk | 12 March 2016 6:21 AM GMTమాజీ లవర్స్ శింబు - నయనతారలు జంటగా నటించిన ఇదు నమ్మ ఆలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. రీసెంట్ గా ట్రైలర్ కూడా విడుదల చేసిన ఈ మూవీ.. షూటింగ్ ఫినిష్ అవుతోందన్న సమయంలో.. ఓ కొత్త కేరక్టర్ ఎంట్రీ ఇచ్చింది. శింబు పక్కన చిందులేయడానికి ఆదా శర్మను తీసుకున్నారన్న వార్తలు ఆశ్చర్యం కలిగించాయి.
ఇదు నమ్మ ఆలు మూవీ టైటిల్ సాంగ్ కోసం ఆదాశర్మను అడగ్గానే ఒప్పుకున్నానని చెబుతోంది ఆదాశర్మ. తాను పాలక్కడ్ లో పుట్టిన తమిళ అమ్మాయినే అంటూ వివరించింది కూడా. కేవలం పాట వరకే కాకుండా.. కొన్ని సన్నివేశాలు కూడా ఉంటాయట. ఇప్పటికే సాంగ్ పిక్చరైజేషన్ ప్రారంభం కూడా అయిపోయింది. శింబు లాంటి ఎనర్జిటిక్ డ్యాన్సర్ పక్కన.. ఓ సూపర్బ్ సాంగ్ లో చేస్తుండడం థ్రిల్ కలిగిస్తోందని చెప్పింది ఆదా.
షేక్ ఇట్ లైక్ షమ్మి - హసీ తో ఫసీ చిత్రాల్లో ఈమె పెర్ఫామెన్స్ చూసి, ఈ పాత్రకు తీసుకున్నట్లు చెప్పారట. తను తమిళ్ మాట్లాడగలగడంతో.. కోలీవుడ్ మూవీ చేసేందుకు ఏ మాత్రం ఇబ్బంది పడ్డం లేదని చెప్పుకొచ్చింది ఆదా శర్మ. తెలుగు, హిందీ సినిమాల కంటే తమిళ్ మూవీస్ చేయడమే తనకు తేలిక అని కూడా చెప్పింది ఈ అమ్మడు. ప్రస్తుతం మరికొన్ని తమిళ్ ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని చెబ్తోంది ఆదాశర్మ.