Begin typing your search above and press return to search.

నన్ను ఇంతటివాడిని చేసింది ఆయనే

By:  Tupaki Desk   |   31 July 2015 10:33 PM GMT
నన్ను ఇంతటివాడిని చేసింది ఆయనే
X
పిల్లలకు నాన్నతో ఉండే సాన్నిహిత్యం, స్నేహం ఇంకెవరితోనూ ఉండదని అంటారు. చిన్నారి వయసు నుంచే తమకి రోల్‌ మోడల్‌ గా ఊహించుకుంటారు పిల్లలు. అందుకే తండ్రికి జీవితంలో ఎక్కవ ప్రాధాన్యత. కొందరు స్టార్లను ఇదే విషయం ప్రశ్నిస్తే ఇలా చెప్పుకొచ్చారు.

టాలీవుడ్‌ లో టాప్‌ హీరోగా వెలిగిపోతున్న మహేష్‌ ఏమన్నారంటే... నాన్నే నాకు అన్నీ. ఆయనే నా గురువు, రోల్‌ మోడల్‌, ఇన్‌ స్పిరేషన్‌ ప్రతిదీ. అంతేకాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఎలానో ఆయనే నేర్పించారు. బాలనటుడి స్థాయి నుంచే పెద్ద సూపర్‌ స్టార్‌ కొడుకుని అన్న గర్వం నాలో లేకుండా చేశారాయన. నన్ను ఇంతటివాడిని చేసింది ఆయనే.

అదే తరహాలో మెగా ఫ్యామిలీ హీరోలందరికీ మెగాస్టార్‌ చిరునే ఇన్‌ స్పిరేషన్‌. అతడు ఫాదర్‌ ఆఫ్‌ మెగా సినిమా. చరణ్‌ ఈరోజు స్టార్‌ హీరోగా ఎదగడం వెనక, బన్ని, సాయిధరమ్‌, వరుణ్‌ తేజ్‌, శిరీష్‌ వంటి హీరోలు పుట్టుకు రావడం వెనక ఉన్న అతిపెద్ద అండ, దండ మెగాస్టార్‌ చిరంజీవి. అలాగే అక్కినేని ఫ్యామిలీలో ఏఎన్నార్‌, నందమూరి ఫ్యామిలీలో తారకరామారావు ఇన్‌ స్పిరేషన్‌ తోనే హీరోలంతా పుట్టుకొచ్చారంటే అతిశయోక్తి లేదు.

అదాశర్మను మీ ఇన్‌ స్పిరేషన్‌ ఎవరు? అని అడిగితే ఏమని చెప్పిందంటే... నా జీవితంలో నాన్న, అమ్మ, అమ్మమ్మ అందరూ కీలకమే. ముఖ్యంగా నాన్న నా రోల్‌ మోడల్‌. నేను నటి అవ్వడానికి అమ్మ సాయం చేస్తే, నా వెన్నంటే నిలిచి నాన్న ప్రోత్సహించారు. గ్రానీ స్కూల్‌ టీచర్‌ గా నాకు పాఠాలు చెప్పింది. ఇలా వీళ్లంతా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతారు.. అని చెప్పింది.