Begin typing your search above and press return to search.

వీడియో : లాక్‌ డౌన్‌ టైంలో ఇలా చేయండి అంటున్న అదాశర్మ

By:  Tupaki Desk   |   4 April 2020 11:00 PM IST
వీడియో : లాక్‌ డౌన్‌ టైంలో ఇలా చేయండి అంటున్న అదాశర్మ
X
సోషల్‌ మీడియాలో అదా శర్మ చాలా యాక్టివ్‌ గా ఉంటుందనే విషయం తెల్సిందే. ఈ అమ్మడు ప్రస్తుతం క్వారెంటైన్‌ ను ఎలా గడుపుతుందో ఎప్పటికప్పుడు పోస్ట్‌ లు పెడుతూనే ఉంది. ఇతరులకు కూడా సలహాలు ఇస్తూ అందాల ప్రదర్శణ చేస్తోంది. తన ఫాలోవర్స్‌ కు తన గ్లామర్‌ షోతో ఫుల్‌ మీల్స్‌ లాంటి అందాల విందు చేస్తూనే ఉన్న అదా శర్మ తాజాగా ఒక వీడియోను పోస్ట్‌ చేసింది. గత ఏడాది తమిళంలో తాను నటించిన ‘చార్లీ చాప్లిన్‌ 2’ సినిమాలోని ఐ వాంట్ టు మ్యారీ మామ పాటను పోస్ట్‌ చేసింది.

ఆ పాటలో ప్రభుదేవాతో కలిసి ఈ అమ్మడు చేసిన స్టెప్పులు చాలా ఫేమస్‌ అయ్యాయి. ఇప్పుడు అవే స్టెప్పులను వేస్తూ సరదాగా టైంను గడపమంటూ సూచిస్తూంది. ఆ వీడియోలో ఈ అమ్మడి వెట్‌ అందాలు ఆరబోస్తూ ఉంది. అందాల ప్రదర్శణతో పాటు క్వారెంటైన్‌ టైంను ఎలా వినియోగించుకోవాలనే విషయాన్ని కూడా ఒకే వీడియోలో అదా శర్మ చూపించింది.

ఒంటరిగా మీరు రూంలో ఉన్న సమయంలో.. లేదంటే ఎవరు లేని సమయంలో ఈ డాన్స్‌ చేయండి. ఇందుకోసం మీరు బీచ్‌ కు వెళ్లడం కాని పార్టీలకు కాని వెళ్లవద్దని కూడా విజ్ఞప్తి చేసింది. పూర్తిగా సోషల్‌ డిటెన్ష్‌ ను పాటిస్తూ ఈ డాన్స్‌ చేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. చాలా మంది ఈ క్యారెంటైన్‌ టైంను ఎలా ఎంజాయ్‌ చేస్తూ గడపవచ్చు అంటూ తనను అడిగారని అందుకే ఈ వీడియోను పోస్ట్‌ చేశాను అని ఈవీడియోలో తాను చేసిన విధంగా డాన్స్‌ చేయాలంటూ సూచించింది.


వీడియో కోసం క్లిక్ చేయండి