Begin typing your search above and press return to search.
ఆకతాయి పనులు మానుకోకపోతే ఇంతే ఆదా!
By: Tupaki Desk | 25 Feb 2022 9:30 AM GMTసాధారణంగా హీరోయిన్స్ లో అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సిఫారసులను దాటుకుని ఒక అవకాశం వాళ్ల వరకూ రావలసి ఉంటుంది. ఇక ఇప్పుడు ఫలానా పాత్రను ఫలానా హీరోయిన్ మాత్రమే చేస్తే బాగుంటుందనే స్థాయి పాత్రలు కూడా ఏమీ లేవు. ఏ పాత్రను ఎవరు చేసినా ఒకటే .. ఎవరికి క్రేజ్ ఎక్కువ ఉంటే వారినే అవకాశాలు వెతుక్కుంటూ వెళతాయి. ఇక ఆ తరువాత వరుసలో ఉన్న కథానాయికలకు పెద్ద సినిమాల్లో ఛాన్సులు ఉండవు .. అలా అని చెప్పేసి చిన్న సినిమాలు చేయలేరు.
కానీ ఎప్పుడూ జనాలకి టచ్ లో ఉండాలి .. అందరికి కాకపోయినా అందులో కొంతమందైనా తమ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటారు. అందుకు వేదికగా సోషల్ మీడియా ఉండనే ఉంది .. అంతే ఇక చెలరేగిపోతారు. తోచీతోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళ్లినట్టు తమకి తోచింది చేసేస్తుంటారు. అలా వాళ్లు చేసే పనులు కొన్ని ఒక్కోసారి వివాదాస్పదమవుతుంటాయి .. వీలైనన్ని విమర్శలు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఈ విషయం అందాల కథానాయిక ఆదా శర్మకి కూడా అనుభవంలోకి వచ్చింది.
ఆదా శర్మ .. తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో నటించింది. కాకపోతే అంతగా విజయాలను అందుకోలేకపోయింది. సోలో హీరోయిన్ గా హిట్స్ ను తన ఖాతాలో వేసుకోలేకపోయింది. అలాంటి ఆదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు సరదాగా కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. అలా తాజాగా ఆమె తన ఫేస్ బుక్ లో బప్పీలహరి ఫొటోకి తన ఫొటో జోడించింది. బప్పీలహరీ మాదిరిగా వంటినిండా బంగారు ఆభరణాలు ధరించి పోజిచ్చి 'ఎవరి ఫోటో బాగుంది?' అనే అర్థం వచ్చేలా ఒక క్యాప్షన్ వదిలింది.
అంతే ఆమె చేసిన పనికి నెటిజన్లు తీవ్రమైన సహనానికి లోనయ్యారు. "నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? అంత పెద్దాయనతో పోల్చుకుంటావా? అదీ ఈ లోకాన్ని వదిలిపోయిన వ్యక్తిని గురించి ఇలా అడుగుతావా? బప్పీలహరి లెజెండ్ .. ఆయనతో నీకు పోలిక ఏంటి? ఒక పని చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలి.
ఫేమస్ కావడం కోసం గొప్పవాళ్లను ఇలా లాగవద్దు. సరదా కోసం ఇలాంటి పనులు చేయడం వలన దిగజారిపోకూడదు. ఇలాంటి పనులు చేసి నీ మీదున్న గౌరవం పోగొట్టుకోవద్దు" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 30 ఏళ్లకు ముందే ఈ తరం పాడుకునే పాటలను అందించిన ఆయనతో ఇలాంటి ఆకతాయి పనులు చేస్తే ఎలా ఉంటుందనేది ఆదాకి తెలిసొచ్చినట్టే!