Begin typing your search above and press return to search.

బోల్డ్ నాటీ అదా ఈ రేంజులో ప్ర‌యోగాలేంట‌బ్బా!

By:  Tupaki Desk   |   15 July 2021 8:00 AM IST
బోల్డ్ నాటీ అదా ఈ రేంజులో ప్ర‌యోగాలేంట‌బ్బా!
X
అదా శ‌ర్మ టాలీవుడ్ కెరీర్ ప్ర‌స్తుతానికి నిల్ .. రాజ‌శేఖ‌ర్ `క‌ల్కి` చిత్రంలో చివ‌రిసారిగా క‌నిపించింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో `ప‌తి పత్ని ఔర్ పంగ` అనే చిత్రంలో న‌టించింది. మామ్స్ అండ‌ర్ స్టాండ్ బెస్ట్ అనే ల‌ఘు చిత్రంతోనూ అదా యూట్యూబ్ లో వైర‌ల్ అయ్యింది. `క్వ‌శ్చ‌న్ మార్క్‌` అనే చిత్రంలో న‌టిస్తోంద‌ని ప్ర‌చార‌మైనా దానికి సంబంధించి అప్ డేట్ లేదు. సోల్ స‌తి అనే చిత్రంలోనూ అదా న‌టిస్తోంది. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల ఈ మూవీ చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది.

అయితే సినిమాల‌తో సంబంధం లేకుండా సోష‌ల్ మీడియాలో వ‌రుస ఫొటోషూట్ల‌తో అదాశ‌ర్మ ట్రీటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫోటోలు వీడియోల‌తోనే ఇన్ స్టా.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ భామ‌కు అసాధార‌ణ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. మ‌రోవైపు ప్ర‌క‌ట‌న‌ల ద్వారా బాగానే ఆర్జిస్తోంది.

తాజాగా అదా స‌రికొత్త గెట‌ప్ తో అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. ఈ బ్యూటీ హెయిర్ క‌ల‌ర్ మారింది. అలాగే రెడ్ ప‌ర్పుల్ గౌన్ లో బోల్డ్ అవ‌తార్ తో మైమ‌రిపిస్తోంది. సాంప్రదాయ ఆభరణాలకు భిన్న‌మైన ఎంపిక‌ల‌తో అదా లుక్ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.