Begin typing your search above and press return to search.
వామ్మోవ్ .. కాబోయేవాడు ఎలా ఉండాలి అంటే!
By: Tupaki Desk | 21 Sept 2019 4:02 PM ISTఅదా కి అదా ట్విట్టర్.. ఇన్ స్టాల్ని అనుసరించే వాళ్లకు అదాశర్మ అల్లరి తుంటరి వేషాల్ని పరిచయం చేయాల్సిన పనేలేదు. ఇదిగో అలాంటి కిక్కిచ్చే పోస్టింగుతో మరోసారి సామాజిక మాధ్యమాల్లో అలజడి సృష్టించింది. ఇంతకీ ఈ అలజడి ఎందుకు? అంటే ఇదిగో హాటీ నాటీ అదా ఇచ్చిన సందేశం చదివితే మీకే అర్థమవుతుంది. అన్నట్టు ఈడొచ్చిన అదాశర్మ సరిజోడు కోసం వెతుకుతోంది. పొగరు ఒగరు ఉన్న పందెంకోడి లాంటి కుర్రాడు కావాలని అడుగుతుంది ఏ ఆడపిల్ల అయినా. కానీ అదా ఏం కోరిందో వింటే నోరెళ్లబెడతారు. ఇంతకీ వరుడి లక్షణాలు ఎలా ఉండాలని కోరింది అంటే..?
ఉల్లి పాయ తిననివాడు.. కులం.. మతం.. రంగు.. షూసైజ్.. వీసా.. ఈత కొట్టే నైపుణ్యం.. బైసెప్ సైజ్... ఇన్ స్టాగ్రమ్ ఫాలోవర్స్.. రాశిఫలాలు జాతకాలు.. ఇవేవీ అవసరం లేదు.. అసలు వీటితో పనే లేదు. అతడికి రోజూ మూడు సార్లు వంట చేసే పనితనం ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. రెగ్యులర్ గా షేవ్ చేసుకోవాలి. ఇంట్లో జీన్స్ వేసుకోవచ్చు కానీ బయటకు వెళ్లినప్పుడు ఓన్లీ భారతీయ సాంప్రదాయ దుస్తుల్ని మాత్రమే ధరించాలి. అతడికి రోజుకు 5 లీటర్ల మంచి నీళ్లు ఇస్తాను. ఆల్కహాల్ నిషేధం. జంతు ఆహారం నిషేధం. ఇంట్లోనూ బయటా కూడా ఇవి రెండూ నిషేధం. భారతదేశంలో అన్ని భాషల సినిమాల్ని గౌరవిస్తూ ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండాలి... అంటూ చిట్టా విప్పింది.
వామ్మోవ్.. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వరుడిని వెతకాలంటే పెళ్లిళ్ల పేరయ్యలకైనా జీవితకాలం చాలదేమో! ఇలా అయితే ఎలా అదా? పురుషపుంగవుడిని వంటింటి కుందేలుని చేయాలన్న నీ ప్రయత్నం సఫలం కాదు గాక కాదు!! ఎందుకంటే ఈరోజుల్లో అలాంటి కుర్రాడు దొరకాలంటే అది చాలా కష్టం. ఆంధ్రా పల్లెటూళ్లలో ప్రతి అమ్మాయికి గవర్నమెంటు ఉద్యోగి మాత్రమే కావాలని కోరినట్టుగా ఉంది నీ కోరిక. ఇది తీరదు గాక తీరదు. నెవ్వర్ ఎవ్వర్. అన్నట్టు నీకోసం ప్రత్యేకించి తయారు చేసిన మనిషి లాంటి రోబోని తేవాలేమో! అంటూ ఓ చిలిపి కుర్రాడు అప్పుడే పంచ్ ఏసేశాడు తెలుసా!!