Begin typing your search above and press return to search.
పబ్లిసిటీ చేసుకోలేదన్న ఆదా
By: Tupaki Desk | 8 Feb 2016 1:30 PM GMTచేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఫలితం ఏముంటుంది? అయినా ఈకాలం కథానాయికలు ఎంత ఫాస్టుగున్నారనీ! సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే ఇక్కడి జనాల్ని, సైకాలజీని చదివేసుంటారు. ఇక ఒక్క మంచి అవకాశం దొరగ్గానే దాన్ని అడ్డుపెట్టుకొని దూసుకెళుతుంటారు. అయితే కొద్దిమంది మాత్రం ఎంత అనుభవమున్నా సరే అవకాశాల్ని మాత్రం అందుకోలేరు. తీరా జరగాల్సిందంతా జరిగిపోయాక ఆలోచిస్తూ కూర్చుంటారు. ఆదాశర్మ విషయంలోనూ అదే జరుగుతోందిప్పుడు.
హిందీలో ఓ దఫా సందడి చేసే తెలుగుకొచ్చిందామె. పూరి జగన్నాథ్ సినిమాతో వస్తున్న కథానాయిక అంటే అందరిలోనూ అటెన్షనే. హార్ట్ ఎటాక్ తో ఆదాశర్మ వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీ మొత్తం ఆమెవైపు చూసింది. సినిమాలో కనిపించిన ఆదాని చూశాక ప్రేక్షకులు కూడా అమ్మాయి బాగుందన్నారు. కానీ ఏం లాభం? ఆ తర్వాత మాత్రం ఆస్థాయిలో అవకాశాల్ని అందుకోలేకపోయింది ఆదా. పైపెచ్చు సన్నాఫ్ సత్యమూర్తిలాంటి సినిమాలో చిన్న పాత్ర చేసింది. అలాంటి పాత్రలు ఎన్ని చేస్తే గుర్తింపొస్తుందనీ! కానీ ఆదాకి అలాంటి అవకాశం తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. దీంతో వచ్చింది చేసేద్దాం అన్నట్టుగా ఇటీవల ఏ సినిమా వస్తే ఆ సినిమాని ఒప్పేసుకోవడానికి రెడీ అవుతోంది. త్వరలోనే ఆమె గరం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల మీడియాతో ఆదా మాట్లాడింది. తన కెరీర్ గురించి చెబుతూ... ``నేను పబ్లిసిటీ చేసుకోలేకపోయా. దీంతో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అయినా నాకేం బాధ లేదు. చేసిన సినిమాలు కొన్నే అయినా ఆదా అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తు పడుతున్నారు. అంతకంటే ఏం కావాలి?`` అంటోంది. పబ్లిసిటీ చేసుకోలేకపోయా అంటే లాభమేముంటుంది? ఇప్పటికైనా తనని తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలుసుకొంటే ఆదా మరో రెండు సినిమాలు వెనకేసుకుంటుంది. లేదంటే మాత్రం ఈ కాంపిటీషన్ లో రాణించడం కష్టమే!