Begin typing your search above and press return to search.

ఆదా... నువ్వు సూప‌ర్ మ‌చ్చీ!

By:  Tupaki Desk   |   29 Jun 2016 3:07 PM GMT
ఆదా... నువ్వు సూప‌ర్ మ‌చ్చీ!
X
ఉత్త‌రాది నుంచి వ‌చ్చిన అమ్మాయిలు తెలుగులో ఒక్క మాట మాట్లాడమ‌న్నా తెగ ఇబ్బందిప‌డిపోతుంటారు. న‌మ‌ష్కారం... అంటూ వ‌చ్చీ రాని తెలుగుతో నానా హైరానా చేస్తుంటారు. కొద్దిమంది మాత్రం ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిందే త‌డ‌వుగా వెంట‌నే తెలుగులో గ‌డ‌గ‌డా మాట్లాడేస్తుంటారు. రాశిఖ‌న్నాలాంటి వాళ్ల‌యితే ఏకంగా పాట‌లు కూడా పాడేస్తుంటారు. తెలుగు బాగా ప‌లికే ఉత్త‌రాది క‌థానాయిక‌ల్లో ఆదాశ‌ర్మ కూడా ఒక‌రు. ఆమె హార్ట్ ఎటాక్‌ లో న‌టిస్తున్న‌ప్పుడే అందులోని డైలాగుల‌న్నీ గ‌డ‌గ‌డా చెప్పేసేది. టీవీ ఇంట‌ర్వ్యూల్లో ఆమె చెప్పే డైలాగులు విని జ‌నాలు విస్తుపోయేవారు.

ఆ త‌ర్వాత డ‌బ్బింగ్ చెప్పుకోలేదేమో కానీ... తెలుగుతో బాగా డీల్ చేసి ఆయా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మెప్పు పొందింది. అవ‌కాశం ఇవ్వ‌డం లేదు కానీ... ఆదా జోరు చూస్తుంటే పాట కూడా పాడేసేలా ఉంది. సూప‌ర్ మ‌చ్చీ... పాట‌ని ఆమె పాడిన విధానం చూస్తే సంగీత ద‌ర్శ‌కులు త‌ప్ప‌కుండా సింగ‌ర్‌ గా ఛాన్సిస్తారేమో అనిపిస్తోంది. ఇంత‌కీ సూప‌ర్ మ‌చ్చీ... పాటని ఆదా ఎప్పుడు ఎక్క‌డ పాడింద‌నేగా మీ సందేహం. ప్ర‌స్తుతం సైమాకోసం సింగపూర్‌ లో గ‌డుపుతోంది ఆదా. అక్క‌డ స్టేజీపైన సూప‌ర్ మ‌చ్చీ పాట‌కి డ్యాన్స్ వేస్తుందో ఏంటో తెలియ‌దు కానీ... కూర్చున్న చోటే ఆ పాట‌ని పాడేస్తూ - మేన‌రిజ‌మ్స్‌ ని ప్ర‌ద‌ర్శిస్తూ తీసుకొన్న ఓ వీడియోని ఆన్‌ లైన్‌ లో పెట్టేసింది. ఆదా పాట పాడిన విధానం చాలా బాగుంది. పాట సృష్టిక‌ర్త దేవిశ్రీప్ర‌సాద్ కూడా ఎంత స్వీట్‌ గా పాడావో అంటూ కితాబునిచ్చాడు. మీరు కూడా ఆదా పాట‌ విన్నాక గ్యారెంటీగా సూప‌ర్ మ‌చ్చీ అనేస్తారు.