Begin typing your search above and press return to search.
ఆ డ్యాన్సులకు హార్ట్ ఎటాక్ గ్యారెంటీ
By: Tupaki Desk | 26 Dec 2019 2:44 PM GMT`అదా కి అదా` ప్రచారార్భాటం గురించి తెలిసిందే. రెగ్యులర్ గా అదాశర్మ ఫోటోలు.. వీడియోలతో సరికొత్త విందు ఇక్కడ సిద్ధంగా ఉంటుంది. మసి పూసి మారేడు కాయ చేసినా.. తనకు ఇప్పటికే సోషల్ మీడియాల్లో లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ వేదిక ఆసరాగా అదా ఎంతో సునాయాసంగా లక్షల్లో ఆర్జించేస్తోంది. నిరంతరం ఏదో ఒక యాడ్ పోస్టింగ్ తో అదా ఆదాయ ఆర్జన చేస్తోంది.
అసలు సినిమాలతో పనే లేకుండా కార్పొరెట్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ పబ్బం గడిపేస్తోంది. తాజాగా క్రిస్మస్ డే ని అదా సంథింగ్ స్పెషల్ గా సెలబ్రేట్ చేసింది. ఈ వేడుకల్లో అదా డ్యాన్సుల హంగామా యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. `జింగిల్ బెల్..` అంటూ సాగే ఆంగ్ల గీతానికి కాళ్లకు గజ్జె కట్టి తన్మయత్వంతో నృత్యం చేసిన ఈ అమ్మడు .. క్లాసికల్ టచ్ ఇస్తూ ట్రీటిచ్చింది.
అయితే అదా శర్మ డ్యాన్సులకు నెటిజనులు ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. ఈ డ్యాన్సులకు కొందరు ఫిదా అయిపోతే మరికొందరు మాత్రం అదా తైతక్కలు చూడలేం బాబోయ్! అంటూ వ్యాఖ్యానించారు. ఆ భరతనాట్యం ఎంత ప్లెజెంట్ గా ఉందో అంటూ వేరొక అభిమాని కామెంట్ ని పోస్ట్ చేశాడు.
అదా శర్మ నటించిన బైపాస్ రోడ్ నవంబర్ లో రిలీజైంది. ఆ సినిమా వల్ల తనకు ఒరిగిందేమీ లేదు. అలాగే `మ్యాన్ టు మ్యాన్` అనే సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. 2019లో కెరీర్ పరంగా ఆశించినంత పెద్ద రేంజుకు చేరలేదు. తెలుగులో బొత్తిగా సినిమాల్లేవ్. కనీసం 2020 అయినా ఈ అమ్మడికి కలిసొస్తుందేమో చూడాలి.
వీడియో కోసం క్లిక్ చేయండి