Begin typing your search above and press return to search.

ఈమెకు సరైన సలహాలు ఇవ్వండయ్యా

By:  Tupaki Desk   |   21 May 2016 5:37 AM GMT
ఈమెకు సరైన సలహాలు ఇవ్వండయ్యా
X
తన గ్లామర్‌ ఫోటోలతో.. క్లీవేజ్‌ షో లతో.. ఎలా మతిపోగొడుతోంది అనే విషయం గురించి ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే అసలు అదా శర్మ ఇలా ఎందుకు హాటుహాటుగా రెచ్చిపోతోంది? ఏకంగా తన యద అందాలన్నీ ఆరబోస్తూ దిగిన ఒక తాజా ఫోటో షూట్‌ చూస్తే.. ఎవ్వరికైనా ఇలాంటి సందేహాలే వస్తాయి.

ఈ మధ్యనే దిగిన కొత్త ఫోటో షూట్‌ లో.. ఒక సూపర్ మోడల్ తరహాలో అందాలను ఆరబోసింది అదా. ఇలా చేయడం వెనుక కారణం ఏంటంటే.. ఈ ఫోటో షూట్లు ఆమెకు సినిమా ఆఫర్లను ఈజీగా తెచ్చేస్తాయి అని ఫీలవుతోందట. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా.. హిందీలో ఒక సినిమా చేస్తున్న ఈ బ్యూటీకి.. తెలుగులో మాత్రం సినిమాల్లేవు. క్షణం సినిమా హిట్టయినా.. అదాకు బ్రేక్‌ రాలేదు. అప్పట్లో ఈ సినిమాకు మేమందరం కలసి బ్రేకిచ్చాం అంటూ అడివి శేష్‌ గర్వంగా చెప్పాడు కాని.. అసలు సినిమాలో చేసిన యాక్టర్లెవ్వరికీ బ్రేక్‌ రాకపోవడం విడ్డూరం. అందుకే అదా ఇలా ఫోటోల బాట పట్టింది.

అసలు ఈమెకు సరైన సలహాలు ఇవ్వని ఈమె పి.ఆర్‌ టీమ్‌ ను అనాలి. అప్పుడే సినిమాల్లో సైడ్‌ హీరోయిన్‌ రోల్సు చేసేస్తే.. ఇక మెయిన్ హీరోయిన్‌ రోల్‌ ఎవరిస్తారు? సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ అండ్ సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాల్లో ఆ చోటా రోల్స్ చేయకుండా ఉండాల్సింది. ఇలా ఫోటోషూట్లు కాకుండా.. తన కాంటాక్ట్స్ తో ఏదైనా మాంచి రోల్‌ పట్టమని ఎవరైనా సలహా ఇవ్వండయ్యా.