Begin typing your search above and press return to search.

క్షణంతో మాయమైన హీరోయిన్

By:  Tupaki Desk   |   11 Aug 2017 4:12 AM GMT
క్షణంతో మాయమైన హీరోయిన్
X
తెలుగులో ఇప్పుడు హీరోలు మధ్య కన్నా హీరోయిన్లు మధ్యనే ఎక్కువ పోటీ ఉంది. పెద్ద హీరోయిన్లు మధ్య ఎప్పుడూ ఉండేదే కానీ ఈ మధ్య చిన్న హీరోయిన్లు మధ్య కూడా గట్టి పోటీ ఏర్పడింది. ఒక్క సినిమాలో నటించి వెంటనే మాయమైన హీరోయిన్లు ఇప్పుడు ఎక్కువై పోతున్నారు. S/o సత్యమూర్తి సినిమాలో ఒక చిన్న నిడివి ఉన్న హీరోయిన్ పాత్ర చేసి ఎవరే ఈ అమ్మాయి అనే లోపే మాయమైంది అదా శర్మ. ఆ తరువాత మళ్ళీ అడివి శేషు హీరోగా నటించిన క్షణం సినిమాలో నటించింది. ఇప్పుడు అయితే ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం పార్టీ గర్ల్ లా ముస్తాబై ఇలా ఫోజ్ ఇస్తుంది.

ఫెమినా మ్యాగజైన్ కవర్ కోసం చేసిన ఫోటో షూట్ లో అదా శర్మ తనను తనే గుర్తుపట్టలేన్నంత కొత్తగా మారింది. జుత్తుకు రంగు వేసి సొంపుగా ముడి వేసి దానికి సరిపడే రంగుతో కళ్లని దిద్ది మచ్చలేని చందమామ లా కనిపిస్తుంది. ఈ ఫోటో షూట్ స్పెషల్ ఏంటంటే జుత్తును ఎలా సింగారించుకోవాలి అనే దాని పై నడిచింది. దానికి తగ్గట్టు గానే ఆదా శర్మా తన శిరోజాలకు చివరన కొత్త రకం రంగు అద్ది ఫ్యాషన్ గా తయారైంది. వైట్ స్కర్ట్ లో పార్టీ కి సిద్దమైన పడుచు పిల్లలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇంత మచ్చలేని మొఖానికి ఇన్ని అందాలు ఎందుకో అనే ప్రశ్న వచ్చేలాగా తన అందాలతో కొన్ని పార్టీ చిట్కాలు చెప్పబోతుంది ఈ ఫెమినా సాలోన్ అండ్ స్పా మ్యాగజైన్ లో.

1920 సినిమా తో హింది ప్రేక్షకులు పరిచయమైన అదా ఆ సినిమాతో ఏమి అంతగా గుర్తింపు రాకపోవడం సౌత్ ఇండస్ట్రిలో కూడా ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఇప్పుడు అయితే అవకాశాలు కోసం అన్నీ ఇండస్ట్రిలపైన ఒక కన్ను వేసి ఉంచింది.