Begin typing your search above and press return to search.

క్షణం పోరి భలే ఛాన్స్ కొట్టేసిందే

By:  Tupaki Desk   |   8 April 2018 3:29 PM GMT
క్షణం పోరి భలే ఛాన్స్ కొట్టేసిందే
X
పూరి జగన్నాధ్ సినిమా హార్ట్ ఎటాక్ తో పరిచయమైనా చెప్పుకోదగ్గ అవకశాలు లేక వెనుకబడిన అదా శర్మ ఆ మధ్య క్షణం లాంటి హిట్ మూవీలో నటించింది కాని అది కూడా ఏమంత ఛాన్సులు తీసుకురాలేదు. కాని తనవరకు పెర్ఫార్మన్స్ పరంగా సన్ అఫ్ సత్యమూర్తి-సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో మెప్పించింది కాని ఫైనల్ గా టైం మాత్రం కలిసి రాలేదు. అయితేనేం పాపకు మోడలింగ్ లో అవకాశాలకు కొదవ లేదు. సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. హాట్ హాట్ స్టిల్స్ తో ఈ మధ్య కొత్త సంచలనాలు రేపుతోంది. తాజాగా ఒక ఫారిన్ బ్రాండ్ కు అంబాసడర్ గా ఎంపికైన అదా శర్మ గాల్లో తేలుతోంది.

జర్మనీ బ్రాండ్ గార్మిన్ కు అదా శర్మ ఇండియా తరఫున ప్రచారకర్తగా వ్యవహరించనుంది. ఫిట్నెస్ తో పాటు ఫ్యాషన్ కు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే ఈ బ్రాండ్ కు పలు అంతర్జాతీయ మార్కెట్లలో చాలా పేరుంది. ఇండియా నుంచి ఈ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి ఎంపికైన మొట్టమొదటి భారతీయ హీరొయిన్ కూడా అదా శర్మనే. దీని గురించి కృతజ్ఞతలు షేర్ చేసుకున్న అదా శర్మ తనకు ఇంతటి స్థానాన్ని కల్పించిన ఫాన్స్ కు థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం అదా శర్మ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. హిందిలో చేస్తున్న కమెండో 3 ఒకటి కాగా రెండోది ప్రభుదేవా సరసన చేస్తున్న చార్లీ చాప్లిన్. తెలుగులో అన్ని సపోర్టింగ్ రోల్స్ వస్తుండటంతో ఇక్కడ గ్యాప్ ఇచ్చిన అదా శర్మ త్వరలోనే కం బ్యాక్ ఇస్తాను అంటోంది. అవకాశాలు ఇవ్వడం ఆలస్యం బోల్డ్ గా నటించడానికి కూడా సై అంటున్న అదా శర్మను మనవాళ్ళు ఇప్పటికైనా గుర్తిస్తారో లేదో.