Begin typing your search above and press return to search.

ఆ క్వశ్చన్ మార్క్ ఏంటమ్మా ఆదా?

By:  Tupaki Desk   |   29 Jan 2016 5:30 PM GMT
ఆ క్వశ్చన్ మార్క్ ఏంటమ్మా ఆదా?
X
ఏదన్నా అర్ధం కాని విషయం ఉంటే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టడం కామనే కానీ.. టాలీవుడ్ బ్యూటీ ఆదాశర్మ తన హ్యాండ్ బ్యాగ్ మీదే క్వశ్చన్ మార్క్ వేసుకుంది. ఫ్యాషన్, ట్రెండ్ అన్ని విషయాల్లోనూ బాగానే ఫాలో అయ్యే ఈ భామ.. తన దగ్గర ఉండే ప్రతీ వస్తువు విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆదా శర్యమ హ్యాండ్ బ్యాగ్ కూడా ఇలాగే ట్రెండింగ్ అయిపోతోంది.

అసలు ఈ అందాల భామ బ్యాగ్ లో ఏముంది అనే క్వశ్చన్ కంటే.. ఆ బ్యాగే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతోంది. రీసెంట్ గా ముంబై టూ హైద్రాబాద్ ట్రావెలింగ్ సమయంలో ఎయిర్ పోర్ట్ లో ఇలా ఈ బ్యాగుతో దర్శనమిచ్చింది ఆదా శర్మ. అసలు సినిమా హీరోయిన్ ని పక్కనే ఉండడాన్నే.. ఒకింత క్రేజీగా ఫీలవుతారు మనోళ్లు. అలాంటిది ఆదా కంటే ఆమె పట్టుకున్న బ్యాగ్ ఇంకా ఆకర్షించడంతో.. ఎటు చూడాలో అర్ధం కాని పరిస్థితి జనాలది. ఇక అమ్మాయిలైతే.. ఈ కొత్త ఫ్యాషన్ బ్యాగ్ వంక ఆరాధనగా చూడ్డం మొదలుపెట్టేశారు. ఎక్కడ కొనుక్కొచ్చిందో కానీ.. మంచి ట్రెండింగ్ బ్యాగ్ నే సెట్ చేసుకుంది ఆదా.

హీరోయిన్ అన్నాక ఆ మాత్రం కొత్తదనం చూపించకపోతే ఎలా అని కొంతమంది అనుకున్నారు కూడా. ఇదిలా ఉంటే గతేడాది ఈమెకి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. సన్నాఫ్ సత్యమూర్తి హిట్ అయినా, ఈమెకు దక్కిందేమీ లేదు. సుబ్రమణ్యం ఫర్ సేల్ లో మరీ అంత నామమాత్రపు రోల్ చేయడం కూడా విమర్శలకు దారి తీసింది. ఈ ఏడాది గరం అనే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది ఆదా శర్మ.