Begin typing your search above and press return to search.
90 ఏళ్ల బామ్మనే కంగారు పెట్టిన ఆదాశర్మ!
By: Tupaki Desk | 21 May 2023 8:00 AM GMTఆదాశర్మ పేరుప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో అన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క బ్లాక్ బస్టర్ తో దక్కించుకుంది. పాన్ ఇండియాలో ఆదాపేరు మారుమ్రోగిపోతుంది. అంతా `ది కేరళ స్టోరీ` మాయాజాలమే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. వంద కోట్లే ఊహించని వసూళ్లు అనుకుంటే! అంతకు రెట్టింపు వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తుంది.
స్టిల్ ఇంకా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర కొనసాగుతుంది. సినిమాలో ఆదాశర్మ పాత్ర ఎంతో కీలకమైనది. ఇస్లాం మతంలోకి మారడానికి- ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేరేందుకు ట్రాప్ అయిన షాలిని ఉన్నికృష్ణన్ అనే మహిళ పాత్రలో అదా శర్మ నటించింది. తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత తన బామ్మ ఏమంటుందో? అని ఆదాశర్మ రిలీజ్ వరకూ చాలా టెన్షన్ పడిందిట.
ముఖ్యంగా అత్యాచార సన్నివేశాలు చూసి అవ్వ ఎలా రియాక్ట్ అవుతుందోనని భయపడిందిట. ఈ సినిమా కథ ముందు బామ్మకి తెలుసు. కానీ అత్యాచార సన్నివేశాలు ఆ వయసులో వారు చూస్తే బాధ పడే అవకాశం ఉంటుంది. కానీ ఆ పాత్ర గొప్పతనాన్ని బామ్మ అర్దం చేసుకోగలిగారు. బామ్మ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ చూసి ఎంతో సంతోషం కలిగింది. 90 ఏళ్ల మా బామ్మ అత్యంత దృఢమైన వ్యక్తని నేను అంగీకరిస్తున్నాను.
ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఆమె దీన్ని వాస్తవ సమాచారాన్ని బోధించిన చిత్రంగా పేర్కొన్నారు. తన విద్యార్థులందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను ఇది అడల్ట్ సినిమా అంటే అప్పుడు దీనికి యు/ఎ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది. తద్వారా యువతులు కూడా సినిమా చూసి తమ చుట్టూ జరిగే విషయాల పట్ల అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుందన్నారు’ అని అదా చెప్పుకొచ్చింది.