Begin typing your search above and press return to search.
కూరగాయలమ్ముతున్న హీరోయిన్
By: Tupaki Desk | 23 Aug 2018 4:09 PM ISTఆమె చూడడానికి మిల్కీ బ్యూటీగా కనిపిస్తారు. ముట్టుకుంటే కమిలిపోయేంత అందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు రోడ్డుపక్కన కూరగాయలు అమ్ముతూ కనిపిస్తోంది. రోడ్డు పక్కన బాగా మాసి, చిరిగిన చీరకట్టుకొని నిద్రలేమితో, అలిసిపోయినట్లుగా కనిపిస్తూ అభిమానులకు షాక్ ఇస్తోంది. ఇంతకీ గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ హీరోయిన్ ఎవరని మీరు కంగారు పడుతున్నారా..? తెలుగు వారి గుండెలను హార్ట్ ఎటాక్ తో కుదిపేసిన ‘ఆదాశర్మ’.
హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, గరమ్ లాంటి సినిమాల్లో కనిపించింది. ఎన్ని పాత్రలు చేసినా స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ ను అందుకోలేకపోయింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘క్షణం’ సినిమా తర్వాత ఆదాశర్మ తెలుగులో పెద్దగా కనిపించలేదు.
తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ సినిమాల కోసం ప్రయత్నిస్తూ ఫొటో షూట్ లలో పాల్గొంటోంది. ఇక ప్రస్తుతం ఓ హాలీవుడ్ సినిమాలో ఆదాశర్మకు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే ఆదా డీగ్లామర్ లుక్ లో ఫొటో షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆదా కూరగాయాలు అమ్ముతున్న ఫొటోలు చూసి ఆమె అభిమానులు - సినీ ఇండస్ట్రీ షాక్ అవుతున్నారు. ఎలా ఉండే ఆదా.. ఎలా అయిపోయిందని మథనపడుతున్నారు.