Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కత్తి లాంటి అందం
By: Tupaki Desk | 14 Jun 2017 1:34 PM GMTకోమలాంగి వాలు చూపులు చాలా కనురెప్ప వేయడం మరిచిపోవడానికి.. గుండె ఆగి కొట్టుకోవడానికి. అలాంటిది అందమంతా కలబోసి.. లావణ్యం మొత్తం జతచేసి నడిచొస్తోందా అన్నట్టుండే అదా శర్మ ఇంత సెక్సీగా కవ్వించడమే కాదు.. ఏకంగా కత్తి దూస్తూ ఉంటే చూసే గుండెలు ఆగిపోవా? హార్ట్ అటాక్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటరైన ఈ భామ నేరుగా తెలుగు ప్రేక్షకుల హార్ట్ లో చోటు సంపాదించేసింది. తర్వాత క్షణం సినిమాతో తనలోని యాక్టింగ్ టాలెంట్ ఏంటో తెలియజేసినా ఈ అమ్మడికి చెప్పుకోదగ్గ ఛాన్సులేం రాలేదు.
హోమ్లీ లుక్ తో అవకాశాలు రాకపోవడంతో అదా శర్మ ఉన్నట్టుండి రూటు మార్చింది. గోల్డ్ కలర్ కాస్ట్యూమ్స్ తో కత్తులు దూస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. హార్ట్ట్ అటాక్ లో అమాయకంగా కనిపించినా అదాలో రాయల్ లుక్ బాగానే ఉంది. ఫిగర్ మెయిన్ టెయినెన్స్ లో జాగ్రత్తగానే ఉంటుంది కాబట్టి ఆ విషయంలో వంక పెట్టడానికి వీలు లేదు. అందం.. సాహసం కలబోసిన పాత్రలకు తాను కరెక్ట్ గా సూటవుతానని చెప్పకుండానే చెబుతోంది.
ఈ మధ్య తమిళంలోని తేనాండాళ్ ఫిలిమ్స్ వారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో సంఘ మిత్ర అనే సినిమా తీద్దాం అనుకున్నారు. శృతిహాసన్ ను లీడ్ రోల్ లో తీసుకోవాలని అనుకున్నారు కానీ ఆమె ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసింది. అదా కొత్త ఫొటోలు చూస్తే ఆమె సంఘమిత్ర పాత్రకు సూటయ్యేలానే ఉంది. ఆ ఫిలిం మేకర్స్ కొంచెం ధైర్యం చేస్తే సరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/