Begin typing your search above and press return to search.

హార్ట్ ఎటాక్ బ్యూటీ పేపర్ డ్రెస్ ఎటాక్!

By:  Tupaki Desk   |   21 Feb 2019 8:10 AM GMT
హార్ట్ ఎటాక్ బ్యూటీ పేపర్ డ్రెస్ ఎటాక్!
X
హాటు బ్యూటీ అదా శర్మ తెలుసు కదా.. 'హార్ట్ ఎటాక్'.. 'S/o సత్యమూర్తి'.. 'క్షణం' లాంటి తెలుగు సినిమాలతో పాటుగా ఇతర భాషలలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈమధ్య తెలుగులో ఆఫర్లు తగ్గాయి. అలా అని అసలే ఆఫర్లు లేవని కాదు. రాజశేఖర్ కొత్త సినిమా 'కల్కి' లో హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాల సంగతేమో కానీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రచ్చ చేయడంలో బహు నేర్పరి.

తాజాగా ఈ భామ నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2019 కార్యక్రమంలో పాల్గొంది. అందరిలాగా ఏదో ఒక డ్రెస్ వేసుకుంటే నన్నెవరు చూస్తారని అనుకుందో ఏమోగానీ న్యూస్ పేపర్ డ్రెస్ లో ప్రత్యక్షమైంది. మరీ టవల్ లా చుట్టుకోకుండా న్యూస్ పేపర్లతో ఒక డిజైనర్ డ్రెస్ లాంటిది వేసుకుంది. మరి దానికి సపోర్ట్ గా వెనక క్లాత్ ఉందో లేదు మనకు తెలియదు. ఎంత పేపర్ డ్రెస్ అయినా క్లీవేజ్ షో చేయడం మాత్రం అసలు మర్చిపోలేదు. ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి "నేను న్యూస్ లో ఉన్నాను. ఎవరైనా న్యూస్ పేపర్ డ్రెస్ వేసుకున్న వారిని ట్యాగ్ చేయండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇక చూసుకోండి నాసామిరంగ.. నెటిజనులు తమదైన శైలిలో కామెంట్లతో రెచ్చిపోయారు. ఒకరు 'అహనా పెళ్ళంట' లో పరమ పిసినారి కోట శ్రీనివాస రావు పేపర్లు ఒంటికి చుట్టుకుంటాడు కదా.. ఆ ఫోటో పోస్ట్ చేసి జంధ్యాలగారు ఎప్పుడో ఈ పేపర్ డ్రెస్ లో హాయి ఉందని చెప్పారన్నారు. మరొకరు నీ" న్యూస్ పేపర్ వయ్యారం సరే.. నీళ్ళు పడతాయేమో చూస్కో" అన్నారు. ఇంకొకరు "నాకు పేపర్ చదివే అలవాటు లేదు. ఈ పేపర్ మాత్రం అక్షరం ముక్క వదలకుండా చదవాలనుంది. అందులో ఏముందో తెలుసుకోవాలనుంది. తెలుసుకున్నది అందరికీ చెప్పాలని ఉంది" అన్నారు.

మరో ఘనుడు "బతికి పోయావు...ఇది 'గుజరాత్ సమాచార్' న్యూస్ పేపర్ కాదు.. లేకపోతే చింపి పారేసేవారు" అన్నాడు. అంత కసిగా అన్నాడంటే ఆ గుజరాత్ న్యూస్ పేపర్ పేపర్ మన తెలుగు న్యూస్ పేపర్ల కంటే జఫ్ఫాలా ఉన్నట్టుందే! ఏదైతేనేం అదా న్యూస్ పేపర్ల డ్రెస్ వేసుకొని న్యూస్ క్రియేట్ చేసింది.