Begin typing your search above and press return to search.
కండల రాణిగా మారిపోతున్న సుకుమారి
By: Tupaki Desk | 19 Oct 2016 7:30 AM GMTకొందరికి అంతే.. ఎప్పుడు టైమ్ కలిసొస్తుందో.. ఎప్పుడు రాదో చెప్పలేం. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ లో తెగ ప్రయత్నాలు చేస్తున్న ఆదాశర్మకు బ్రేక్ రాలేదు. తెలుగులో హార్ట్ ఎటాక్ - సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు హిట్ అయినా అమ్మడికి ఒరిగిందేమీ లేదు. కానీ క్షణం లాంటి లో బడ్జెట్ మూవీ సక్సెస్ తర్వాత అమ్మడి ఫేట్ మారిపోయింది.
హిందీలో క్షణం రీమేక్ కూడా ఆదానే హీరోయిన్ అన్నారు కానీ.. ఇంకా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు. కాకపోతే ప్రస్తుతం కమాండో2 అంటూ విద్యుత్ జమాల్ తో కలిసి ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తోంది. ఈ మూవీ కోసం ఆదా శర్మ బాగానే కష్టపడుతోంది. యాక్షన్ సీన్స్ కూడా చేయాల్సిన అవసరం చాలానే ఉండడంతో.. అందుకు తగ్గట్లుగా ఒళ్లు వంచేస్తోంది. బాగా వర్కవుట్స్ చేసి పెంచిన కండలను చూపిస్తూ.. ఓ ఫోటో కూడా తీయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేసిందీ బ్యూటీ. ఆర్మీ టీ షర్ట్ వేసుకుని.. కమాండో గాళ్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ.. చూస్తున్నారా నా కండలు అన్నట్లుగా పోజ్ ఇచ్చింది ఆదా శర్మ.
ఫేస్ లో ఎంత రఫ్ నెస్ చూపిద్దామని ప్రయత్నించినా.. ఆదా మొహంలో కనిపించే అమాయకత్వం.. శరీరంలో కనిపించే సున్నితత్వం మాత్రం అలానే ఉన్నాయ్. ఆమెకు అవే అసలైన ఆభరణాలు కాబట్టి.. అలానే అడ్జస్ట్ అయిపోదాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/