Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అందమైన వ్యాయామం

By:  Tupaki Desk   |   15 Jun 2017 2:11 PM GMT
ఫోటో స్టోరి: అందమైన వ్యాయామం
X
హార్ట్ ఎటాక్ - సన్ ఆఫ్ సత్యమూర్తి - క్షణం లాంటి సినిమాలు చేసిన ఆదా శర్మ తెలుగులో చెప్పుకో తగ్గ సినిమాలు ఏమి ఇప్పుడు చేయడంలేదు. హిందీలో కమాండో-2 లో నటించింది. ఇప్పుడు రణబీర్ కత్రినా కైఫ్ నటిస్తున్న జగ్గా జాసూస్ లో ఒక పాత్రలో మెరవనుంది. అమాయకంగా ఒక సాధారణ అమ్మాయిలా కనిపించే ఈమెకు మల్లకంభ అనే సంప్రదాయ వ్యాయామ క్రీడ కూడా వచ్చండోయ్.

నిజానికి అదా తల్లి షీలా శర్మకి సంప్రదాయ మల్లకంభ క్రీడలో గొప్ప ప్రావీణ్యం వుందట. ఈ వయసులో కూడా ఆమె తల్లి మల్లకంభని ప్రాక్టీస్‌ చేస్తుంటుందని సోషల్ మీడియా ద్వారా ఆదా శర్మ ఒకసారి వెల్లడించింది. తల్లి అలా ఉంటె కూతురు ఎందుకు ఊరుకుంటుంది.. తను కూడా ఒక స్థాయిలో విజృంభిస్తుంది ఇలా. దుంగ పై ఇలా ఎక్కి తన ప్రావిణ్యం ఏపాటిదో అందరికి తెలిసే లాగా ఒక పిక్చర్ ని షేర్ చేసింది పాపాయి. ఆ ఫోటోకు కాప్షన్ కూడా 'విమెన్‌ ఆన్‌ టాప్‌' పెట్టింది. సినిమాలు ఏమి లేకపోడంతో తన ఫిట్నెస్ పై ఫోకస్ చేసినట్లు ఉందిలే.

నిజానికి మన దేశంలో అనేక ప్రాచీన కళలు జిమ్నాస్టిక్స్‌కి ఆధారం అనే వాదన కూడా ఉంది. మల్లకంభ అంటే చెక్కతో చేసిన స్తంభం ఆధారంగా చేసే వ్యాయామ క్రీడ. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కన్పించే ఈ వ్యాయామ క్రీడ అత్యంత ప్రత్యేకమైనది. ఇప్పుడు ఇలాంటి స్టార్స్ కూడా చేస్తే దీనికి కాస్త పాపులారిటీ వస్తుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/