Begin typing your search above and press return to search.

రోమియో-జూలియట్.. సందేశం విన్నారా?

By:  Tupaki Desk   |   3 Nov 2017 8:14 AM GMT
రోమియో-జూలియట్.. సందేశం విన్నారా?
X
ప్రస్తుత రోజుల్లో ఏదైనా బిజినెస్ మొదలు పెట్టినా అలాగే మంచి పనులు కోసం కార్యక్రమలను మొదలు పెట్టినా.. ఏ విషయమైన నలుగురికి తెలియాలంటే ప్రచారం తప్పకుండా అవసరం. ముఖ్యంగా సెలబ్రెటీలతో ప్రచారం నిర్వహించడం ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపోయిందనే చెప్పాలి. అయితే వారు ఎక్కువగా ప్రయివేట్ బిజినెస్ తరహాలో ఉన్న కంపెనీలకు మాత్రమే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఎవరో కొందరు మాత్రమే కొన్ని మంచి కార్యక్రమాలకు వారి స్టైల్ లో బ్రాండ్ అంబాసిడర్స్ గా బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ అండ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ఒక మంచి కార్యక్రమం కోసం మంచి యాడ్ లో నటించారు. పూణేలో మొదలైన ఆధార్ పూనవాల క్లీన్ సిటీ కార్యక్రమం కోసం వీరిద్దరూ రోమియో-జూలియట్ పాత్రలతో చక్కటి సందేశాన్ని అందించారు. స్వచ్ఛ్ భారత్ కి బలమైన ఆ కార్యక్రమం అందరిలో అవగాహన తీసుకురావాలని వారు ఆ యాడ్ ద్వారా తెలిపారు.

కమర్షియల్ యాడ్ లనే అలియా భట్ కిస్ ఇవ్వమని బ్రతిమాలుతూ ఉండడం.. ఆ తర్వాత స్వచ్ఛ్ భారత్ కి తగ్గట్టు సందేశాన్ని ఇవ్వడం చాలా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో నెటీజన్స్ చాలా బావుంది అనే పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది.