Begin typing your search above and press return to search.
నటుడికి కోవిడ్ పాజిటివ్ అని తెలిశాక కనీసం చెప్పకుండా..!
By: Tupaki Desk | 17 April 2021 5:30 AM GMTసినీపరిశ్రమలో ఆర్టిస్టుల అభద్రత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రంగంలో రెడ్ కార్పెట్ వేసినంత వేగంగానే అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఓ ప్రముఖ నటుడికి కోవిడ్ అని తెలియగానే అతడికి కనీసం ఒక మాట అయినా చెప్పకుండా సినిమా నుంచి తొలగించేసింది చిత్రబృందం. కనీస మాత్రంగా అతడికి ముందస్తు సమాచారం అయినా లేదు. ఇది ఎంతో అహేతుకం అంటూ సదరు నటుడు ఆవేదన చెందడం పరిశ్రమలో చర్చకు వచ్చింది.
ఇంతకీ ఆ నటుడు ఎవరు? అంటే.. పరిశ్రమ సీనియర్ సహాయనటుడు ఆదర్శ్ బాలకృష్ణ. హ్యాపీడేస్ సహా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అగ్ర హీరోల సినిమాల్లో నటించిన ఆదర్శ్ బాలకృష్ణ `బిగ్ బాస్` సీజన్ 1లో సందడి చేశారు. కెరీర్ పరంగా అతడికి వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు. కానీ ఇంతలోనే విధి ఎదురు తిరిగింది. ఇటీవల అతడికి అతడి కుటుంబసభ్యులందరికీ కోవిడ్ పాజిటివ్ అని తెలియడంతో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
కోవిడ్ వల్ల తాను షూటింగ్ కి హాజరు కాలేని స్థితిలో ఉన్నానని చిత్రబృందానికి వెల్లడించారు ఆదర్శ్. అయితే ఇలాంటి సమయంలో సానుభూతి పొందటానికి బదులుగా ఆదర్శ్ ని ఎటువంటి సమాచారం లేకుండా చిత్రం నుండి తొలగించారు. వేరొకరితో అతడి స్థానాన్ని భర్తీ చేశారు.
``ఈ రంగంలో ఒక నటుడి అభద్రతకు కొలమానం లేదు. కానీ హే.. ఇదేమి జీవితం!`` అంటూ ఆదర్శ్ ఆవేదనగా ట్వీట్ చేశారు. తనని తొలగించినందుకు విచారం లేదు కానీ.. వారి అహేతుక చర్యనే అతడు నిలదీసే ప్రయత్నం చేశాడు. కనీసం ఒక మెసేజ్ పంపినా సంతోషించేవాడిననని అతడు విచారించారు.