Begin typing your search above and press return to search.
ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ లో ఆదర్శ్ బాలకృష్ణ
By: Tupaki Desk | 12 Oct 2018 7:54 AM GMTతెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆదర్శ్ బాలకృష్ణ సినిమాల్లో మాత్రం అంతగా అవకాశాలు దక్కించుకోవడంలో విఫలం అవుతున్నాడు. బిగ్ బాస్ తర్వాత కూడా ఈయనకు పెద్దగా ఛాన్స్ లు వచ్చినట్లుగా అనిపించలేదు. తాజాగా ఒక మంచి అవకాశం ఆదర్శ్ కు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాక్ పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఆ వెబ్ సిరీస్ లో ఆదర్శ్ బాలకృష్ణ కీలకమైన కెప్టెన్ విక్రమ్ కుంద్రా పాత్రను పోషిస్తున్నాడట.
టెర్రరిస్ట్ ల క్యాంప్ లపై ఇండియన్ ఆర్మీ సాగించిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో ఆమద్య ఒక చిత్రం కూడా మొదలైంది. అయితే ఆ చిత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తాజాగా అదే సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో ఇప్పుడు వెబ్ సిరీస్ కు సిద్దం అయ్యారు. ఈ వెబ్ సిరీస్ లో అమిత్ సద్, దర్శన్ కుమార్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరిద్దరితో పాటు కెప్టెన్ విక్రమ్ కుంద్రాగా ఆదర్శ్ నటించే మంచి ఛాన్స్ ను దక్కించుకున్నాడు.
హిందీలో ‘ఇండియా స్ట్రైక్స్’ అనే టైటిల్ తో రూపొందబోతున్న ఈ వెబ్ సిరీస్ ను జమ్ము కాశ్మీర్ బోర్డర్ లో చిత్రీకరించనున్నట్లుగా సమాచారం అందుతుంది. డానీ బోయల్ దర్శకత్వంలో తెరకెక్కిన స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంకు సహాయ దర్శకుడిగా వ్యవహరించిన రాజ్ ఆచార్య ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈనెల 19న ఆదర్శ్ సోదరి వివాహం ఉంది. అది పూర్తి అవ్వగానే ఆదర్ష్ జమ్ము కాశ్మీర్ కు ‘ఇండియా స్ట్రైక్స్’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.