Begin typing your search above and press return to search.
బాలకృష్ణ పెళ్లి చేసుకుంటున్నాడు
By: Tupaki Desk | 12 May 2016 7:30 AM GMTబాలకృష్ణేంటి పెళ్లి చేసుకోవడమేంటి.. ఇదేమైనా ‘గౌతమపుత్ర శాతకర్ణి’కి సంబంధించిన సన్నివేశమా.. అంటారా? ఇక్కడ మాట్లాడుతోంది నందమూరి బాలకృష్ణ గురించి కాదులెండి. ఇండస్ట్రీలోని మరో బాలకృష్ణ గురించి. ఆదర్శ్ బాలకృష్ణ పేరుతో టాలీవుడ్లో ఓ యువ నటుడు ఉన్న సంగతి తెలిసిందే. హ్యాపీ డేస్.. వినాయకుడు.. గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాల్లో నెగెటివ్ క్యారెక్టర్లు చేసి టిపికల్ బాడీ లాంగ్వేజ్.. వాయిస్ మాడ్యులేషన్ తో మంచి పేరు సంపాదించిన ఆదర్శ్ బాలకృష్ణ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. మార్చిలోనే అతడికి నిశ్చితార్థం అయింది. మే 28న హైదరాబాద్ లో పెళ్లి జరగబోతోంది.
ఆదర్శ్ పెళ్లి వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. అతను సినిమాటిక్ స్టయిల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల కిందట ఓ స్నేహితుడి పెళ్లి కోసం ఢిల్లీకి వెళ్లాడట. ఆ పెళ్లిలో గుల్నార్ అనే అమ్మాయిని చూసి పడిపోయాడట. ఆమె దగ్గరికి వెళ్లి నంబర్ అడిగితే ఇవ్వలేదట. తర్వాత ఏదేదో చేసి చివరికి నంబర్ సంపాదించాడట. ఆపై మాటలు కలిశాయి. ఇద్దరూ కలిసిన రెండో మీటింగ్ లో ప్రేమ పుట్టింది. మూడో మీటింగ్ లో గుల్నార్ తల్లిదండ్రుల్ని కలిశాడట ఆదర్శ్. నాలుగో మీటింగ్లో పెళ్లికి ముహూర్తం కుదిరింది.
ఆదర్శ్ సినిమా కెరీర్ బాగానే నడుస్తోందిప్పుడు. కుర్రాడికి పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా ఉండటంతో అవతలి వైపు నుంచి త్వరగానే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆదర్శ్ పెదనాన్న మరెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి.