Begin typing your search above and press return to search.
ఆ రెండు మోడళ్ళ కథలూ రాసుకుంటున్నారు
By: Tupaki Desk | 8 Aug 2016 10:30 PM GMTఆ మధ్యన దర్శకుడు తేజ ఒక మాటన్నాడు. అయితే మన తెలుగు సినిమాల్లో బాబు గారు కథలు.. లేకపోతే ఫారిన్ నుండి ఇండియా వచ్చే హీరో కథలు తప్పించి.. అసలు కొత్తవేం రావట్లేదని. ఎవ్వరూ కొత్తవి రాయట్లేదని .. కాని తనని మాత్రం కాపీ అంటూ ఆరోపిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు తేజ మాటలు అర్ధం చేసుకుని కొత్తవి రాస్తున్నారండోయ్. ఇంతకీ ఆ కొత్తవి ఏంటో తెలుసా?
ఒక సినిమా హిట్టయ్యిందంటే అదే ఫార్మాట్లో మన దగ్గర చాలా సినిమాలు వచ్చేస్తుంటాయి. బొమ్మరిల్లు ఆడిందని అదే ఫార్మాట్ లో దిల్ రాజు చాలా సినిమాలను తీశాడు. చాలామటుకు ఫ్లాపులే. తరువాత అలాగే విక్రమార్కుడు - ఛత్రపతి సినిమాల ఫార్మాట్లో కూడా చాలా సినిమాలొచ్చాయి. కాని అలాంటి స్ర్కీన్ ప్లే రాజమౌళి ఒక్కడే బాగా తీశాడు. ఇకపోతే మగధీర రాగానే చాలామంది రాజుల గెటప్పులపై పడ్డారు. బాహుబలి ఒక్కటే ఆడింది. అయినాసరే ఇప్పుడు రెండు ఫార్మట్ల కథలను మనోళ్లు తెగ రాసేస్తున్నారు. ఒకటి 'క్షణం' టైపులో థ్రిల్లర్ కాగా.. రెండోది 'పెళ్లి చూపులు' టైపులో రొమాంటిక్ కామెడీ.
స్వయంగా ఇప్పుడు అడివి శేష్ కూర్చుని ఒక థ్రిల్లర్ కథ రాసుకుంటున్నాడు. ఆ సినిమాకు ఇద్దరు నూతన దర్శకులు దర్శకత్వం వహిస్తారు. ఇక పెళ్ళి చూపులు టైపులో రొమాంటిక్ కామెడీలో తెగ రానున్నాయట. అలా ఉంటుందండీ సంగతి.